పవన్ కళ్యాణ్ కి - అల్లు అర్జున్ కి మధ్యన కోల్డ్ వార్ అనే మాట చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ అన్నప్పటినుండి ఎక్కువైంది. అల్లు అర్జున్ ఆర్మీ vs పవన్ ఫాన్స్ అన్నట్టుగా సోషల్ మీడియాలోనూ వీరి యవ్వారం హాట్ హాట్ గానే ఉండేది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తన సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా పిలిచినా.. ఎక్కడో ఏదో మూల పవన్ ఫాన్స్ పై అల్లు అర్జున్ గుర్రుగా ఉన్నాడనే మాట వినిపిస్తూనే ఉంటుంది. ఆ కోల్డ్ వార్ సంగతి అలా ఉంటే.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయ్యాక మెగాస్టార్ చిరు పవన్ ని విష్ చేసారు. తర్వాత మెగా హీరోల నుండి భీమ్లా నాయక్ పై పెద్దగా ట్వీట్స్ పడలేదు.
కానీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఆ విషయం తెలిసాక పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ రీసెంట్ హిట్ చిత్రం భీమ్లా నాయక్ సినిమాని అల్లు అర్జున్ ప్రత్యేకంగా మహేష్ ఏఎంబి మాల్ లో వీక్షించడమే. అది కూడా అల్లు అర్జున్ తన ఫ్యామిలీ తో కలిసి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ని ఎంజాయ్ చేసారట. ఆ విషయం తెలిసిన పవన్ ఫన్సన్, ఇటు అల్లు అర్జున్ ఫాన్స్ ఇద్దరూ సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప తో ఈమధ్యనే భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. తన చిన్న మావయ్య పవన్ భీమ్లా నాయక్ సినిమాని చూడడం నిజంగా స్పెషల్ అని చెప్పుకుంటున్నారు.