ఫిబ్రవరి 25 న భీమ్లా నాయక్ ని రిలీజ్ చేస్తున్నామని నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియాలో ప్రకటించేసారు. అప్పటికి ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యు తెగలేదు. టికెట్ రేట్స్ పెంచుకునే జీవో ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తూనే ఉంది. అయినప్పటికీ భీమ్లా నిర్మాతలు తగ్గలేదు. అటు ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్స్ దగ్గర రేట్స్ పెంచకుండా రెవిన్యూ అధికారులు, పోలీస్ తో కాపు కాయించారు. దానితో భీమ్లా నాయక్ కి ఏపీలో నష్టాలూ వచ్చేలా కనిపిస్తుంది వయ్వహారం. భీమ్లా నాయక్ సక్సెస్ ఫుల్ గా ఓ వారం పూర్తి చేసుకుంది. అటు తెలంగాణాలో టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు, ఐదో ఆటకి అనుమతి కూడా ఇవ్వడంతో తెలంగాణాలో భీమ్లా నాయక్ గట్టెక్కేసేలా కనిపిస్తుంది. కానీ ఆంధ్రలో టికెట్ రేట్ కష్టాలు.. తప్పేలా లేవు నష్టాలు అన్నట్టుగా ఉంది భీమ్లా నాయక్ వ్యవహారం. భీమ్లా నాయక్ 7 రోజుల కలెక్షన్స్ మీ కోసం
ఏరియా కలెక్షన్స్(కోట్లలో) భీమ్లా బిజినెస్
నైజాం - 33.22/35
సీడెడ్ - 10.09/16.5
అర్బన్ ఏరియాస్ - 6.91/9
ఈస్ట్ గోదావరి - 5.02/6.4
వెస్ట్ గోదావరి - 4.63/5.4
గుంటూరు - 4.82/7.2
కృష్ణ - 3.38/6
నెల్లూరు - 2.33/3.25
ఏపీ - టీఎస్ - 70.40/88.75 కోట్లు
ఇతర ప్రాంతాలు - 7.65/9
ఓవర్సీస్ - 11.55/9
టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 89.60/106.75 కోట్లు