మార్చ్ 11 న వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న రాధే శ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గ్లామర్ హీరోయిన్ పూజ హెగ్డే ఇంకా దర్శకుడు రాధా కృష్ణ ముంబైలోనే ఉన్నారు. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో కళ్ళు చెదిరేలా ప్లాన్ చేసి ప్రభాస్ ఫాన్స్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసిన టీం.. ఇప్పుడు ముంబై లో రాధే శ్యామ్ సెకండ్ ట్రైలర్ లాంచ్ చెయ్యడమే కాకుండా అక్కడి మీడియా తో ఇంటరాక్ట్ అవుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక రాధేశ్యామ్ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.
రాధే శ్యామ్ తెలుగు వర్షన్ కి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డు సినిమా చూసి రాధే శ్యామ్ అద్భుతం అని పొగిడినట్లుగా తెలుస్తుంది. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా రన్ టైం కూడా లాక్ చేసారు. జస్ట్ 2 గంటల 18 నిమిషాలుగా రాధే శ్యామ్ రన్ టైం ఉండబోతుంది. ప్రభాస్ లుక్స్, పెరఫార్మెన్స్, పూజ హెగ్డే గ్లామర్, విధి రాత, లవ్, ఎమోషనల్ కలగలిపిన రాధే శ్యామ్ సినిమాలో మెయిన్ గా ప్రభాస్ - పూజ మధ్యన రొమాంటిక్ యాంగిల్, అలాగే రాధే శ్యామ్ క్లైమాక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది.