పుష్ప1 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టి రిలాక్స్ అయిన అల్లు అర్జున్ మళ్ళీ పుష్ప ద రూల్ కోసం రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు. సుకుమార్ అండ్ టీం కూడా పుష్ప 2 కోసం లొకేషన్స్ సెట్ చేసి పెట్టుకోవడం, ఇంకా సెకండ్ పార్ట్ కి అవసరమైన కీలకనటుల ఎంపిక పూర్తి చెయ్యడం, రష్మిక కూడా ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రమోషన్స్ ని ముగించెయ్యడంతో.. పుష్ప షూటింగ్ కి ప్రిపేర్ అవుతుంది. సో అన్ని రకాలుగా పుష్ప 2 షూటింగ్ మొదలు పెట్టేందుకు రంగం సిద్దమవడంతో.. రేపో మాపో అఫీషియల్ గా పుష్ప 2 షూటింగ్ అప్ డేట్ రాబోతుందని తెలుస్తుంది.
పుష్ప 2 కోసం అల్లు అర్జున్ మళ్లీ పుష్ప రాజ్ లుక్ లోకి మారతాడన్నమాట. ఇక మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కూడా పుష్ప టీం కి అందుబాటులోకి వచ్చేస్తున్నారని, అయితే ఇప్పుడు పార్ట్ 2 కోసం బాలీవుడ్ నుండి మరో విలన్ ని కూడా చేర్చుకోబోతున్నారట. ఇప్పటికే హిందీ లో 100 కోట్ల మార్క్ తో ప్రభంజనం సృష్టించింది. పుష్ప కోసం బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపితే సెకండ్ పార్ట్ కి మరింత క్రేజ్, హైప్ క్రియేట్ అవుతుంది అని టీం ప్లాన్ అట. ఇక పుష్ప ద రూల్ లో అల్లు అర్జున్ విలన్స్ అందరిని చంపేసి ఎర్ర చందనం బ్లాక్ దందానే శాసించే నాయకుడిగా ఎదగడం, భన్వర్ లాల్ పై కక్ష ఎలా తీర్చుకున్నాడో అనేది మెయిన్ హైలెట్ గా నిలవబోతుందట.