Advertisementt

ప్రభాస్ ప్రాజెక్ట్ కే కి ఆనంద్ మహీంద్రా సాయం?

Fri 04th Mar 2022 12:31 PM
nag ashwin,prabhas,anand mahindra,project k,big b,deepika padukone,  ప్రభాస్ ప్రాజెక్ట్ కే కి ఆనంద్ మహీంద్రా సాయం?
Will Anand Mahindra take up Nag Ashwin Project K ? ప్రభాస్ ప్రాజెక్ట్ కే కి ఆనంద్ మహీంద్రా సాయం?
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు. మార్చి 11 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని ముంబై వేదికగా ప్రమోట్ చేస్తుంది టీం. ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్స్ సలార్, ప్రాజెక్ట్ కే సెట్స్ మీదున్నాయి. ఇప్పటికే ఆ సినిమాలు కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా.. రాధే శ్యామ్ రిలీజ్ టెంక్షన్ తీరాక ప్రభాస్ ఆ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటారు. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఇంటెర్నేషన్ లెవల్లో తెరకెక్కుతుండగా.. సలార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటుంది. అయితే నాగ్ అశ్విన్ ప్రాజెక్టు కే విషయంలో దిగ్గజ బిజినెస్ మ్యాన్ ని ఓ సాయం కోరారు. ఆనంద్ మహీంద్రాని టాగ్ చేస్తూ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసారు.

ఆ ట్వీట్ లో నాగ్ అశ్విన్ డియర్ ఆనంద్ మహీంద్రా గారు.. చాలా విషయాలు మీ నుండి నేర్చుకున్నాను. ప్రస్తుతం నేను.. బాలీవుడ్ స్టార్ అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకొనె లాంటి స్టార్స్ తో ప్రాజెక్ట్ కే అనే ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న టెక్నాలిజీకి మించి మేము ఎంతో డిఫరెంట్ వాహనాలను, అలాగే అధునాతనమైన వాహనాలు ప్రాజెక్ట్ కే కోసం రూపొందిస్తున్నాము. ఒకవేళ మా కల నిజమైతే.. అది ఇండియా కె గర్వకారణం. ఇండియాలో ఇంతవరకు ఇలాంటి సినిమా తెరకెక్కలేదు. అందుకే మేము ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. కాబట్టి ఇంజనీర్స్ విషయంలో మీ నుండి ఏదైనా సాయం అందితే మేము సంతోషిస్తాము.. అంటూ ఆనంద్ మహీంద్రాని టాగ్ చేస్తూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేసారు.

Will Anand Mahindra take up Nag Ashwin Project K ?:

What is Anand Mahindra connection to Project K?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ