టాలీవుడ్ లో కరోనా తీవ్రత తగ్గడం, ఏపీలో 100 పర్సెంట్ సీటింగ్ రావడం, అక్కడ టికెట్ ఇష్యు ఓ కొలిక్కి రావడంతో సినిమాల జాతర మొదలైంది. వారం వారం చిన్న సినిమాలు, రెండు వారాలకొకసారి పెద్ద సినిమాలతో బాక్సాఫీసు కళకళలాడుతుంది. భీమ్లా నాయక్ హిట్ తో కాసుల గలగలలు వినిపించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యణ్ భీమ్లా నాయక్ హిట్ అవడంతో.. పెద్ద సినిమాలకి ఊపొచ్చింది. మార్చ్ 11 న రాధే శ్యామ్ పాన్ ఇండియా ఫిలిం గా విడుదలకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ ప్రమోషన్స్ తో సోషల్ మీడియా కూడా బిజీగా వుంది. ముంబై లో రాధే శ్యామ్ ప్రమోషన్స్ తో మీడియాలోనూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది.
అయితే ఈనెల 25 న రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి ఎప్పుడు ప్రచారం మొదలు పెడతారా అని చూస్తున్నారు. అయితే రాధే శ్యామ్ రిలీజ్ హడావిడిలో ప్రమోషన్స్ ఎందుకు, అది రిలీజ్ అయిన 2 డేస్ తర్వాత ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని మరోసారి రాజమౌళి దేశ వ్యాప్తంగా హీటెక్కించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గత డిసెంబర్ లోనే 20 డేస్ పాటు ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ తో ఐదు భాషల ప్రేక్షకులపై ఆర్.ఆర్.ఆర్ తో చెరగని ముద్ర వేశారు రాజమౌళి. ఇక ఈసారి ఇంటర్నేషనల్ గాను ఆర్.ఆర్.ఆర్ ని ప్రమోట్ చేయబోతున్నారట. హైదరాబాద్, బెంగుళూర్ లో ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్స్ ని కనీ వినీ రీతిలో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది.