Advertisementt

ద వారియర్ హిందీ డబ్బింగ్ రైట్స్ కి భారీ క్రేజ్

Fri 04th Mar 2022 10:27 AM
the warrior,hindi rights,ram potineni,lingu samy,krithi shetty,aadi pinishetty  ద వారియర్ హిందీ డబ్బింగ్ రైట్స్ కి భారీ క్రేజ్
Ram Pothineni Warriorr Hindi Dubbing Rights Sold For Sensational Price ద వారియర్ హిందీ డబ్బింగ్ రైట్స్ కి భారీ క్రేజ్
Advertisement
Ads by CJ

తెలుగులో యాక్షన్ ప్యాకెడ్ మూవీస్ కి బాలీవుడ్ యూట్యూబ్ లో విపరీతమైన క్రేజ్. అందుకే ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ డబ్బింగ్ రైట్స్ ని భారీ ధరకు దక్కించుకుంటున్నారు. తాజాగా హీరో రామ్ పోతినేని ద వారియర్ హిందీ డబ్బింగ్ హక్కులు భారీ డీల్ తో అమ్ముడుపోయాయని, లింగు సామీ దర్శకత్వంలో బై లింగువల్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లకి అమ్ముడు పోయినట్లుగా తెలుస్తుంది. ఈ మధ్యనే రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇంకా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని తెలుగు, తమిళ భాషలకి కలిపి 35 కోట్ల డీల్ తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో క్రేజీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ కృతి శెట్టి విజిల్ మహాలక్ష్మి గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. సరైనోడు విలన్ ఆది పినిశెట్టి రామ్ ని ఢీ కొట్టబోతున్నాడు. రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన రామ్ లుక్, విజిల్ మహాలక్ష్మి లుక్, ఆదిపినిశెట్టి లుక్స్ కి ఫాన్స్ నుండి విశేష స్పందన వచ్చింది. 

Ram Pothineni Warriorr Hindi Dubbing Rights Sold For Sensational Price:

Warrior Hindi rights sold for a whopping price!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ