Advertisementt

పిక్ టాక్: కీర్తి సురేష్ వింటేజ్ లుక్

Thu 03rd Mar 2022 10:09 PM
keerthy suresh,keerthy suresh vintage look,keerty suresh in green saree,keerthy suresh new photos  పిక్ టాక్: కీర్తి సురేష్ వింటేజ్ లుక్
Pic Talk: Keerthy Suresh Vintage Look పిక్ టాక్: కీర్తి సురేష్ వింటేజ్ లుక్
Advertisement
Ads by CJ

సర్కారు వారి పాటలో గ్లామర్ గా, క్యూట్ గా కనిపిస్తున్న కీర్తి సురేష్.. గత రెండేళ్లుగా లుక్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంటుంది. మహానటి తర్వాత లుక్ విషయంలోనే కాదు.. సినిమాల ఎంపిక విషయంలోనూ కీర్తి సురేష్ ఫెయిల్ అయ్యింది. మహానటి తర్వాత కీర్తి సురేష్ కి ఇంతవరకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేసినా.. స్టార్ హీరో రజినీకాంత్ సిస్టర్ గా నటించినా కీర్తి సురేష్ కి హిట్ దక్కలేదు. నితిన్ తో నటించిన రంగ్ దే హిట్ అయినా.. లుక్ విషయంలో కీర్తి సురేష్ ని విమర్శించని వారే లేరు. సర్కారు వారి పాట కళావతి సాంగ్ లో కీర్తి సురేష్ కన్నా మహేష్ బాబు హైలెట్ అయ్యారు. ఇక కీర్తి సురేష్ మరో సారంగదరియా అంటూ గాంధర్వ అనే మ్యూజికల్ ఆల్బమ్ లో తన నాట్యాన్ని చూపించింది. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఆ సాంగ్ సారంగదరియా అంత లేకపోయినా.. ఓకే ఓకె అనిపించింది.

తాను బరువు తగ్గాక ఎప్పటికప్పుడు తన లుక్ ని, తాను గ్లామర్ గా దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుండే కీర్తి సురేష్.. తాజాగా ట్రెడిషనల్ గా సారీ లో ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది. వింటేజ్ లుక్ అంటూ కీర్తి సురేష్ ఆ పిక్స్ కి క్యాప్షన్ పెట్టింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఆ లుక్ లో కీర్తి సురేష్ దేవకన్యలా మెరిసిపోతుంది. గ్రీన్ కలర్ ఫ్యాన్సీ సారీ లో నుదుటిన పెద్ద బొట్టు, జడ కొప్పు, పూలు తో కీర్తి సురేష్ వింటేజ్ లుక్ మాత్రం అద్భుతమనేలా ఉంది.

Pic Talk: Keerthy Suresh Vintage Look:

Keerthy Suresh Vintage Look goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ