బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ అంటే ఇష్టపడని వారే ఉండరు. అమితాబ్ తెలుగు స్టార్స్ తో ఉన్న అనుబంధం దృశ్య వారి సినిమాల్లో ఆయన గెస్ట్ రోల్స్ కూడా చేసారు. చిరు సై రా లో ఆయన చిరుకి గురువుగా కనిపిస్తే, నాగ్ మనం సినిమాలో డాక్టర్ గా జస్ట్ క్యామియో రోల్ లో కనిపించారు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా మూవీ లో అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ పై కొన్ని సీన్స్ కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించారు. అమితాబ్ ప్రభాస్ తో వర్క్ చేస్తున్న విషయం సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రభాస్ పంపిన భోజనం చేసి ఆకాశానికెత్తేసారు ఆయన.
తాజాగా ప్రభాస్ కూడా రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో అమితాబ్ తో వర్క్ చెయ్యడం తన కల అని, అది ప్రాజెక్ట్ కే తో తీరుతుంది అని. చెప్పారు. అమితాబ్ గురించి గంటలు గంటలు చెప్పను.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనో అద్భుతమైన మనిషి అంటూ అమితాబ్ ని వర్ణించారు ప్రభాస్. ప్రభాస్ రాధే శ్యామ్ కి బిగ్ బి హిందీ లో వాయిస్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్, పూజ మరియు దర్శకుడు రాధా కృష్ణలు బాలీవుడ్ మీడియా తో ఇంటరాక్ట్ అవుతున్నారు. నిన్న ట్రైలర్ లాంచ్ చేసిన ప్రభాస్ అండ్ టీం.. ఈ రోజు మీడియా మీట్ లో పాల్గొంది.