గత శనివారం నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ ఓటిటి నాన్ స్టాప్ హాట్ స్టార్ లో గ్రాండ్ గా మొదలయ్యింది. తొమ్మిదిమంది ఓల్డ్ కంటెస్టెంట్స్, ఎనిమిది మంది కొత్త కంటెస్టెంట్స్ తో ఓటిటి బిగ్ బాస్ హౌస్ కళకళలాడింది. గత ఐదురోజులుగా బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రోగ్రాం ఓకె ఓకె గా ఆదరిస్తున్నారు ఫాన్స్. స్టార్ మా లో ఓ గంట ప్రోగ్రాం ని ఎంజాయ్ చేసే వారికి బిగ్ బాస్ ఓటిటి 24 గంటల పాటు లైవ్ అంటే బొత్తిగా నచ్చడం లేదు. ఉదయం ఓ గంట, సాయంత్రం ఓ గంట పాటు ఎడిట్ చేసిన బిగ్ బాస్ ఓటిటి ఎపిసోడ్స్ కూడా అంతగా ఆదరణ లేదని అంటున్నారు. మరోపక్క 24 గంటలు లైవ్ అంటున్నా.. ఓ రెండు గంటలు లేటుగానే బిగ్ బాస్ ఓటిటి వస్తుంది. ఆ రెండు గంటల్లో ఎంతో కొంత ఎడిటింగ్ చెయ్యొచ్చు అని అలా ప్లాన్ చేసింది యాజమాన్యం.
కానీ ఇప్పుడు ఆ టైం ఎడిటింగ్ కి చాలడం లేదట. అలాగే తమిళ బిగ్ బాస్ ఒరిజినల్ గా ఈ రోజుమొదలైతే.. అది రేపు టెలికాస్ట్ అవుతుంది. తెలుగులో అలా కాదు. అయితే గత రాత్రి 12 నుండి బిగ్ బాస్ లైవ్ ఆగిపోయింది. దానితో హాట్ స్టార్ లవర్స్ ఫీలవుతున్నారు. అయితే 70 కెమెరాల మధ్యన ఏ కెమెరా దగ్గర ఆడియన్స్ కి నచ్చే ఫుటేజ్ ఉంటుందో అనేది కేవలం రెండు గంటల్లో చూడడం అసంభవంగా మారడంతో.. ఓ రోజు గ్యాప్ తీసుకుని ఆ ఫుటేజ్ పరిశీలించి ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళ ఫుటేజ్ ని ప్రసారం చేసేలా ప్లాన్ చేసుకుని ఈ రోజు గురువారం రాత్రి 12 గంటల నుండి బిగ్ బాస్ నాన్ స్టాప్ ని మళ్ళీ లైన్ లోకి తేబోతున్నారని తెలుస్తుంది.
అలాగే 24 గంటలు లైవ్ అంటూ వారు నిద్రపోతున్న సమయాన్ని కూడా చూపించడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతుండడం గమనించిన యాజమాన్యం ఆ సమయంలో వేరే కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటున్నట్టుగా ఉండే ఫుటేజ్ ని ప్రసారం చేసేలా చూస్తున్నారట. సో బిగ్ బాస్ ఓటిటి ఆగడానికి సవాలక్ష కారణాలన్నమాట.