బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్ సార్ధక టాస్క్ లతో మెప్పించగా.. మోనాల్ గజ్జర్ గ్లామర్ గా అదరగొట్టేసింది. అయితే వీరిద్దరూ విడి విడిగా కాకుండా జంటగానే ఎక్కువగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ లో అఖిల్ - మోనాల్ మధ్యన లవ్ ట్రాక్ నడిచినట్టుగా బిగ్ బాస్ లో చూపించారు. ఇక విన్నర్ గా అఖిల్, టాప్ 5 కి వెళ్లకుండానే మోనాల్ బయటికి వచ్చేసారు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక కూడా పార్టీలు, కలిసి సినిమా కూడా కమిట్ అయ్యారు. అంతలాంటి బంధంతో పెనవేసుకుపోయిన.. ఈ జంట పై ఇప్పటికీ రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా బిగ్ బాస్ ఓటిటిలో ఛాలంజెర్స్, వారియర్స్ మధ్యన టాస్క్ లో భాగంగా.. గతంలో బిగ్ బాస్ లో చేసిన తప్పులు ఎలా సరిదిద్దుకుంటారో చెప్పమని టాస్క్ ఇచ్చారు. దానిలో భాగంగా చాలెంజర్స్ టీం కంటెస్టెంట్ యాంకర్ శివ అఖిల్ ని.. నీకు.. మోనాల్‌కు మధ్య చూపించిన సీన్స్ నిజమేనా? లేదా బిగ్ బాస్ క్రియేట్ చేసినట్లు అనిపించిందా.. అని అడగగా.. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య ఏదైతే చూపించారో అది నిజం. అంతలా మా మధ్య కనెక్షన్ కుదిరింది. అంతెందుకు నేను బిగ్ బాస్ షోలోకి వచ్చే ముందు వరకూ నేను, మోనాల్ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుకునే వాళ్లం. కానీ అది లవ్ ట్రాక్ అని చెప్పలేను. ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువే అని మాత్రం చెప్పగలను.. అంటూ అఖిల్ సార్థక్ మోనాల్ విషయాన్ని బయటపెట్టాడు.