త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ కో జోడిగా అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తర్వాత శతమానం భవతి, హలో గురూ ప్రేమ కోసమే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనదైన ముద్ర వేసింది. ఈ ఏడాది రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం బటర్ ఫ్లై. గురువారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బటర్ ఫ్లై టీజర్ లోకి వెళితే..
చాలా సంతోషంగా అపార్ట్ మెంట్‌లో అడుగుపెడుతుంది అనుపమ పరమేశ్వరన్. లిఫ్ట్ లో అడుగుపెట్టి తొమ్మిదో ఫ్లోర్ కి చేరుకోవాల్సిన ఆమె రెండు, నాలుగు, ఎనిమిదిలో ఎందుకు ఆగింది? అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యాలేంటి? స్టెప్స్ లో వెళ్లినప్పుడు తెలిసిన విషయాలేంటి? సరదాగా ఉండాల్సిన ఆ వయసులో ఆమెకు అర్థమైన అంశాలేంటి? అనుక్షణం తరిమే ఇంటెన్స్ ఉన్న మ్యూజిక్‌తో ఇంట్రస్టింగ్‌గా ఉంది బటర్‌ఫ్లై టీజర్. అనుపమ ఫ్రెష్ లుక్‌తో కనిపిస్తున్నారు. కెమెరా ఫ్రేమ్ వర్క్ అద్భుతంగా ఉంది. జెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన థ్రిల్లర్ అని టీజర్ చూడగానే అర్థమవుతోంది. మరి అలాంటి సబ్జెక్ట్ కి బటర్‌ఫ్లై అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది సస్పెన్స్.