కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14 వరల్డ్ వైడ్ గా రిలీజ్ రెడీ అవుతుంది. నిన్నటివరకు ఏప్రిల్ 14 నుండి కెజిఎఫ్ చాప్టర్ 2 వెనక్కి వెళ్లే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే తమిళనాట బీస్ట్, హిందీలో జెర్సీ సినిమాలు కూడా ఏప్రిల్ 14 నే విడుదల కాబోతున్నాయి. దానితో పాన్ ఇండియా మూవీ కాబట్టి కెజిఎఫ్ కి ప్రాబ్లెమ్ అవుతుంది అని మేకర్స్ కూడా వెనక్కి తగ్గుతారని అనుకున్నారు. కానీ నిన్న ఒక్కసారిగా సోషల్ మీడియాలో కెజిఎఫ్ 2 ట్రెండ్ అయ్యింది. మార్చ్ 8 సాయంత్రం కెజిఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ అంటూ వార్తలొచ్చేశాయి. దానితో అలెర్ట్ అయిన కెజిఎఫ్ టీం.. ఈ రోజు కెజిఎఫ్ నుండి ట్రైలర్ అప్ డేట్ రాబోతున్నట్టుగా ప్రకటించారు.
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 ట్రైలర్ మార్చ్ 27 సాయంత్రం 6:40 నిమిషాలకి విడుదల చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. There is always a thunder before the storm! #KGFChapter2 Trailer on March 27th at 6:40 pm. Stay Tuned: bit.ly/HombaleFilms అంటూ కెజిఎఫ్ ట్రైలర్ అప్ డేట్ ఇచ్చారు. దానితో యశ్ ఫాన్స్ మాత్రమే కాదు.. మాస్ ప్రేక్షకులు కెజిఎఫ్ 2 ట్రైలర్ కోసం వెయిట్ చెయ్యడానికి రెడీ అయ్యారు. కెజిఎఫ్ తోనే అంచనాలకు మించి హిట్ కొట్టిన యశ్.. కెజిఎఫ్ 2 తో ఎన్నెన్ని రికార్డులు ఎన్నెన్ని సంచనాలు నెలకొల్పుతాడో అని అందరూ క్యూరియాసిటీగా ఉన్నారు.