బిగ్ బాస్ ఓటిటి మొదలై ఇంకా వారం రోజులు పూర్తి కాలేదు. అప్పుడే హౌస్ లో గొడవలు తార స్థాయికి చేరాయి. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ని ఓ టీమ్, కొత్త కంటెస్టెంట్స్ ని ఓ టీం గా బిగ్ బాస్ విభజించి ఆడిస్తుంది. పాత కంటెస్టెంట్స్ కి వారియర్స్, కొత్త వాళ్ళకి చాలెంజర్స్ అంటూ పేర్లు పెట్టి ఒకరిపైకి ఒకరిని ఉసిగొలుపుతున్నారు. టాస్క్ ల విషయంలో, కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఒకరిపై ఒకరు తిట్టుకోవడమే కాదు.. ఫిజికల్ గాను గొడవ పడుతున్నారు. ఇక గత సీజన్స్ లో ఎడిటింగ్ చేసి బిగ్ బాస్ కి కావల్సిన ఫుటేజ్ నే బుల్లితెర ప్రేక్షకులకి ఇచ్చేవారు. కానీ ఈ బిగ్ బాస్ ఓటిటి 24 గంటలూ ప్రసారమవడంతో ఎడిటింగ్ కి ఛాన్స్ లేదు, భూతులని బీప్ చెయ్యడానికి వీల్లేదు. అలా బిగ్ బాస్ ఓటిటిలో మొదటిరోజునుండే బోల్డ్ గా కనిపించడమే కాదు.. భూతులు మాట్లాడేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇక తాజాగా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ చాలెంజర్స్ కి వారియర్స్ కి మధ్యన స్టిక్కర్లు టాస్క్ ఇచ్చారు. అందులో యాంకర్ శివ-నటరాజ్ మాస్టర్ భూతులు మాట్లాడుతూ ఒకరిపైకి ఒకరు గొడవకి దిగారు. నామినేషన్స్ అప్పుడే నటరాజ్ మాస్టర్ కంట్రోల్ తప్పాడు. ఇప్పుడు ఈ స్టిక్కర్లు టాస్క్ లో శివ vs నటరాజ్ అన్నట్టుగా ఈ టాస్క్ సాగింది. నువ్వేం పీకుతావ్ అంటే నువ్వేం పీకుతావ్ అంటూ ఇద్దరూ కొట్లాటకు దిగారు. ఇక చివరిలో శివ పద్దతిగా మాట్లాడండి.. లేకపోతె నేనేమిటో చూపిస్తాను అంటూ నటరాజ్ మాస్టర్ కి వార్నింగ్ ఇచ్చేవరకు ఈ గొడవ జరుగుతూనే ఉంది. లాస్ట్ కి ముమైత్ - అఖిల్ ఇద్దరూ వారిద్దరిని కంట్రోల్ చేసారు.