Advertisementt

కెజిఎఫ్ 2 ట్రైలర్ డేట్ ఫిక్స్?

Wed 02nd Mar 2022 08:02 PM
prashanth neel,yash,kgf 2 movie,prashanth neel - yash combo,kgf 2 trailer,prashanth neel - yash kgf 2,kgf 2 trailer release date  కెజిఎఫ్ 2 ట్రైలర్ డేట్ ఫిక్స్?
KGF 2 Trailer release date fix కెజిఎఫ్ 2 ట్రైలర్ డేట్ ఫిక్స్?
Advertisement
Ads by CJ

కన్నడ సంచలనం కెజిఎఫ్.. అంచనాలను తారుమారు చేస్తూ పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసింది. యశ్ హీరోయిజానికి ఆ భాషా లేదు, ఈ భాషా లేదు.. అన్ని రకాల మాస్ ప్రేక్షకులు కెజిఎఫ్ ని ఎక్కడో నిలబెట్టేసారు. ప్రశాంత్ నీల్ యశ్ ని ప్రెజెంట్ చేసిన తీరుకి టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా పడిపోయారంటే.. ఆయన హీరో ఎలివేషన్ సీన్స్ ని ఎంత అద్భుతంగా తెరకెక్కించారో తెలుస్తుంది. హీరోయిజాన్ని ఎంతగా ఎక్సపోజ్ చెయ్యొచ్చో కెజిఎఫ్ లో యశ్ కేరెక్టర్ చూస్తే అర్ధమవుతుంది. అందుకే కెజిఎఫ్ పార్ట్ 2 పై అంతగా అంచనాలు, అన్ని భాషల ప్రేక్షకులని ఎదురు చూసేలా చేస్తుంది. ఏప్రిల్ 14 న ప్రశాంత్ నీల్ - యశ్ కాంబో కెజిఎఫ్ 2 రిలీజ్ కి ముహూర్తం పెట్టారు. 

బాలీవుడ్ స్టార్స్ భాగమైన పార్ట్ 2 లో సంజయ్ దత్ మెయిన్ విలన్ గాను, రవీనా టాండన్, ఇలా చాలామంది విలన్స్ గా కనిపించబోతున్నారు. అయితే ఏప్రిల్ 14 న రిలీజ్ అవ్వబోయే కెజిఎఫ్ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కెజిఎఫ్ టీం మొత్తం అన్ని భాషల్లో కెజిఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం పెట్టిందట. కెజిఎఫ్ 2 ట్రైలర్ మార్చ్ 8, సాయంత్రం 6.18 గంటలకు విడుదల కానుంది అని తెలుస్తుంది. కెజిఎఫ్ ట్రైలర్ తోనే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. 

KGF 2 Trailer release date fix:

Prashanth Neel - Yash KGF 2 Trailer release date fix

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ