పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర తెరకెక్కించిన భీమ్లా నాయక్ మూవీ సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. త్రివిక్రమ్ డైలాగ్స్, రానా పెరఫార్మెన్స్, పవన్ పెరఫార్మెన్స్, థమన్ మ్యూజిక్ అన్ని సినిమాకి హైలెట్ గా నిలవడంతో.. భీమ్లా నాయక్ హిట్ అయ్యింది. దానితో పవన్ కళ్యాణ్ ఫాన్స్ పండగ చేసుకున్నారు. మొదటి మూడు రోజులు బాక్సాఫీసు దగ్గర శివతాండవం చేసిన భీమ్లా నాయక్ సోమవారం మాత్రం నీరసించిపోయింది. మళ్లీ నిన్న మంగళవారం శివరాత్రి రోజున భీమ్లా నాయక్ కలెక్షన్స్ లో భారీ తేడా కనిపించి.. కలెక్షన్స్ పెరిగాయి. భీమ్లా నాయక్ 5 డేస్ కలెక్షన్స్ మీ కోసం.
ఏరియా కలెక్షన్స్(కోట్లలో)
నైజాం - 31.19
సీడెడ్ - 8.88
ఉత్తరాంధ్ర - 6.26
ఈస్ట్ గోదావరి - 4.69
వెస్ట్ గోదావరి - 4.48
గుంటూరు - 4.65
కృష్ణా - 3.13
నెల్లూరు - 2.22
ఏపీ, తెలంగాణ 5 డేస్ కలెక్షన్స్ - 65.50 కోట్లు
ఇతర ప్రాంతాలు - 7.30 కో
ఓవర్సీస్ - 11.20 కోట్లు
వరల్డ్ వైడ్ 5 డేస్ కలెక్షన్స్ - 84.00 కోట్లు