పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సక్సెస్ తో హ్యాపీ గా ఉన్నారు. ఆ సినిమా సక్సెస్ తో మేకర్స్ కూడా ఫుల్ జోష్ లో సక్సెస్ మీట్, సక్సెస్ పార్టీ అంటూ హడవిడి చేసారు. భీమ్లా నాయక్ సందడి ముగియడంతో పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు. మార్చి రెండో వారం నుండి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత హరీష్ భవదీయుడు, సురేందర్ రెడ్డి సినిమాలు పవన్ చెయ్యాల్సి ఉండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం తన సినిమాల లైనప్ తో ఫాన్స్ కి సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉన్నారు.
అందులో భాగంగానే తన మేనల్లుడు హీరో సాయి ధరమ్ తో ఓ మూవీకి కమిట్ అయ్యారనే న్యూస్ ఎప్పటినుండో ప్రచారం లో ఉంది. ఇప్పుడు ఆ సినిమాని పట్టాలెక్కించేందుకు పవన్ రెడీగా ఉన్నారని అంటున్నారు.సాయి ధరమ్ తో పవన్ కళ్యాణ్ తమిళ దర్శక, నటుడు సముద్రఖని దర్శకత్వంలో తమిళనాట విజయం సాధించిన వినోదయ సైతం సినిమాని రీమేక్ చేయబోతున్నారని, ఆ సినిమా ఈ నెల 25 నుండి మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాకి అప్పుడే పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా కేటాయించారని.. 20 రోజులపాటు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారని అంటున్నారు. మరి వరస రీమేక్స్ తో విజయాలని అందుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈసారి మేనల్లుడికి హిట్ ఇచ్చేందుకు రంగంలోకి దిగబోతున్నారన్నమాట.