2022 స్టార్టింగ్ లోనే ప్రభాస్ రాధే శ్యామ్ తో ఫాన్స్ ని కూల్ చేద్దామనుకుంటే కరోనా కుదరనివ్వలేదు. అది కాస్తా మార్చ్ 11 కి షిఫ్ట్ అయ్యింది. ప్రభాస్ లేటెస్ట్ చిత్రం రాధే శ్యామ్ ప్రమోషన్స్ రేపటినుండి ఓ సరికొత్త ట్రైలర్ తో మొదలు కాబోతున్నాయి. ఇక ఆగష్టు లో ప్రభాస్ ఆదిపురుష్ కూడా వచ్చేస్తుంది అనుకుంటే అది వచ్చే ఏడాది జనవరికి వెళ్ళిపోయింది. మహా శివరాత్రి స్పెషల్ గా ఆదిపురుష్ డేట్ లాక్ చేసింది టీం. అంటే వచ్చే జనవరిలో ఆదిపురుష్.. తర్వాత సమ్మర్ లో కానీ దసరాకి కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సలార్ వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది.
ఈ ఏడాది ఏప్రిల్ 14 న కెజిఎఫ్ 2 రిలీజ్ చేసేసి.. ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ షూటింగ్ కి వెళ్ళిపోతారు. సలార్ రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చెయ్యాలి.. అందుకే అన్ని భాషలకి అనుకూలంగా ముందుగా డేట్ లాక్ చేసేస్తారు అని తెలుస్తుంది. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ వస్తే వచ్చే ఏడాది డిసెంబర్ అయినా లేదంటే 2024 సంక్రాంతికి అయినా ఉండొచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా 2023 మొత్తం ప్రభాస్ ఫాన్స్ ఆయన సినిమాలతో ఫుల్ జోష్ లో పండగ చేసుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.