రకుల్ ప్రీత్ ఈ పేరు వినగానే.. ఈమధ్యన ఆమె చేసే గ్లామర్ షో నే గుర్తుకు వస్తుంది. టాలీవుడ్ అవకాశాలు లేకపోతేనేమి, రాకపోతేనేమి.. బాలీవుడ్ లో మాత్రం ఫుల్ బిజీగా సినిమాలు సినిమాలు చేసుకుంటున్న రకుల్ ప్రీత్ కి ఈమధ్యన వెకేషన్స్ బాగా ఎక్కువయ్యాయి. బాలీవుడ్ హీరో జాకీ భగ్నాని ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ మొన్నీమధ్యనే ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని తాజమహల్ ని చుట్టేసి వచ్చింది. అంతేకాకుండా బాలీవుడ్ పెళ్ళిళ్ళకి, పార్టీలకు ప్రియుడు జాకీ భగ్నాని తో కలిసి అటెండ్ అవుతూ ఎంజాయ్ చేస్తున్న రకుల్ కి బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచినా.. ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ దక్కలేదు.
కానీ ఇప్పుడు రకుల్ నటించిన ఐదారు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో రకుల్ కి ఒక్క హిట్ వచ్చినా చాలు అమ్మడు రేంజ్ మారిపోవడానికి. అదలా అంటే.. వేసవి ఆరంభంలోనే రకుల్ ప్రీత్ తన ప్రియుడు జాకీ భగ్నాని తో కలసి మాల్దీవులకు ట్రిప్ వేసింది. మాల్దీవుల్లో రకుల్ బికినీ షో మంటలు పుట్టిస్తున్నాయి. అమ్మడు వాటర్ లో కూల్ అవుతూ.. హాట్ షో చేస్తుంది. పింక్ బికినిలో రకుల్ సైజ్ జీరో లా సూర్యుడు వేడికి మెరిసిపోతూ ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే.. అది కాస్తా వైరల్ అయ్యింది.