ఇస్మార్ట్ హిట్ కొట్టి రెడ్ హాట్ ఫామ్ లోకి వచ్చిన రామ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి నేతృత్వంలో ది వారియర్ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఉప్పెనలా దూసుకొచ్చి ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసిన కృతి శెట్టి హీరోయిన్. అలాగే ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి చేస్తున్నాడని గతంలోనే ప్రకటించిన సినిమా యూనిట్ నేడు శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని ది వారియర్ లో ఆది పినిశెట్టి చేస్తోన్న గురు క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేసారు.
హీరోగా తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఖాకీ చొక్కా తొడిగి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న రామ్ కి ఆది పినిశెట్టి రూపంలో సరైన అప్పోనెంట్ సెట్ అయినట్టే అనిపిస్తోంది గురు లుక్ చూస్తోంటే.! ఆల్ రెడీ అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి అదరగొట్టే విలనీ చూసి ఉన్నాం కనుక వారియర్ రామ్ తో గురు చేసే వార్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందులోనూ మాస్ పల్స్ బాగా తెలిసిన లింగుసామి డైరెక్షన్ అంటే రంజుగా సాగే పోరుకి రంగం సిద్దమైనట్టే.!
అన్నట్టు... తెలుగు - తమిళ్ ద్విభాషా చిత్రంగా రానున్న ది వారియర్ మూవీ కోసం సరైనోడు విలన్ ఆది పినిశెట్టిని ఏరి కోరి ఎంచుకున్న రామ్ పాన్ ఇండియా ఫిలింగా రూపొందనున్న తన తదుపరి చిత్రానికి సరైనోడు డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కడుతుండడం విశేషం. మరి సరిగ్గా అలా కుదిరిందో ఏమో కానీ సరైన ఎంపికే జరిగిందనేలా రామ్ కి రాకింగ్ హిట్స్ పడాలని ఆశిద్దాం.