మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా సినిమాల్లోకి ఎంటరైన దుల్కర్ సాల్మన్ షార్ట్ టైమ్ లోనే తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. ఓకే బంగారం, మహానటి వంటి చిత్రాలతో మన తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యాడు.
ఇక నాగ చైతన్య గురించి అందరికీ తెలిసిందేగా. అక్కినేని లెగసీని నడిపించే బాధ్యతను చేపట్టి సిల్వర్ స్క్రీన్ పైకి జోష్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన చైతు విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి విజయాలతో తన ఇమేజ్ పెంచుకుంటూ జోరుమీదున్నాడు.
స్టార్ కిడ్స్ అవడం ఒక్కటే కాకుండా స్టోరీ సెలెక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్, సైలెంట్ నేచర్ వంటి పలు అంశాల్లో చాలా సిమిలారిటీస్ ఉన్న ఈ వెర్సటైల్ హీరోలిద్దరూ నేడు ఒకే వేదికపై కలిసి కనిపించనుండడం విశేషం. మహానటి సినిమాలో వీరిద్దరూ నటించినప్పటికీ ఆ సినిమాలో కాంబినేషన్ సీన్స్ లేకపోవడం వల్ల చైతు - దుల్కర్ లని ఒకే ఫ్రేమ్ లో చూసే ఛాన్స్ నేటికి దొరుకుతోంది అభిమానులకి. అదెలాగంటే...
దుల్కర్ సాల్మన్ హీరోగా - కాజల్ అగర్వాల్, అదితిరావు హైదరి హీరోయిన్స్ గా కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వంలో రూపొందిన హేయ్ సినామిక చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మార్చి 3 న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిధిగా హేయ్ సినామిక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. సో.. హైదరాబాద్ వెస్టిన్ హోటల్ లో నేటి సాయంత్రం 6 గంటలనుంచీ జరగబోయే ఆ కార్యక్రమంలో ఒకే వేదికపై ఈ ఇద్దరు వెర్సటైల్ హీరోస్ ని చూడొచ్చు.. చైతు - దుల్కర్ ల కలయికని వారిద్దరి అభిమానులు ఆస్వాదించొచ్చు.