మొదటి మూడు రోజులూ ఉధృతంగా వచ్చిన భీమ్లా వసూళ్లు నాలుగో రోజు నిదానించాయి. ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ రిపోర్ట్ తెచ్చుకుని అంతటా పాజిటివ్ మౌత్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ ఫెంటాస్టిక్ రెవిన్యూ రాబట్టుకున్న బీమ్లా స్పీడ్ ని వర్కింగ్ డే అయిన మండే స్లో డౌన్ చేసిందని చెప్పాలి. అక్కడికీ మార్నింగ్ షో, మ్యాట్నీలతో పోల్చితే ఫస్ట్ షో - సెకండ్ షోలు కొంచెం పుంజుకున్నాయి.
ఇక నేటి మహా శివరాత్రి పర్వదినం భీమ్లా నాయక్ కి బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది అనడంలో సందేహం లేదు. చాలా ఏరియాస్ లో రెగ్యులర్ షోస్ తో పాటు నైట్ స్పెషల్ షోస్ కూడా ప్లాన్ చేస్తున్నారు కనుక భీమ్లా కి ఈ రోజు మంచి షేర్ వస్తుందని ఆశించొచ్చు. మరిప్పుడు నాలుగవ రోజైన మండే రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ కి ఇచ్చిన షేర్ వివరాల్లోకి వెళితే...
నైజాం : 2.40Cr
సీడెడ్ : 75L
ఉత్తరాంధ్ర : 72L
ఈస్ట్ : 36L
వెస్ట్ : 24L
కృష్ణా : 34L
గుంటూరు : 36L
నెల్లూరు : 18L
AP-TG టోటల్ - 5.35Cr షేర్ (8.72cr గ్రాస్)