Advertisementt

మెగా ట్రీట్ : భోళా శంకర్ ఫస్ట్ లుక్

Tue 01st Mar 2022 09:42 AM
chiranjeevi bhola shankar first look,chiru bhola shankar motion moster released,megastar chiranjeevi as bhola shankar  మెగా ట్రీట్ : భోళా శంకర్ ఫస్ట్ లుక్
Bhola Shankar First Look మెగా ట్రీట్ : భోళా శంకర్ ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

మహా శివరాత్రి పర్వదినాన తన అభిమానులకు భోళా శంకర్ గా దర్శనమిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. మహతి స్వర సాగర్ అందించిన ఎలెక్ట్రిఫయింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో భోళా శంకర్ గా చిరు ఎట్రాక్టివ్ లుక్ ని రివీల్ చేసారు దర్శకుడు మెహర్ రమేష్.

నాటికీ, నేటికీ, ఏనాటికీ తన గ్రేస్ - తన ఛార్మ్ - తన స్టైల్ తనకు మాత్రమే సొంతం అన్నట్టు దర్జాగా కూర్చున్న భోళా శంకర్ లుక్ లో చిరు చాలా ముచ్చటగా.. మూడు పదుల వయసు తగ్గిపోయిందా అనిపించేంతటి ఆకర్షణీయంగా ఉన్నారు. చేతిలో గిరగిరా తిరుగుతోన్న కీ చైన్ తో చిరు చూపిస్తోన్న యాటిట్యూడ్ ఎంత మాస్ గా ఎస్టాబ్లిష్ అవుతోందో.. ఆ కీ చైన్ లోనే త్రిశూలాన్ని అమర్చడం అంత క్లాసీ టచ్ అనిపించింది.

మొత్తానికి ఆ శంకరుని భక్తితో కొలుచుకునే పండుగ రోజున ఈ భోళా శంకరుడి పాత్రను ప్రేక్షకాభిమానుల ముందు పెడుతూ సందర్భోచితమైన సందడిని సృష్టించారు శివ శంకర వరప్రసాద్. 

మెగాస్టార్ గా ఎంతటి ఖ్యాతిని పొందినప్పటికీ చిరంజీవి అసలు పేరు అదేగా. 

ఆయన నిజంగానే నటరాజైన శివ శంకర వర ప్రసాదమని అందరికీ తెలిసిందేగా.!

Bhola Shankar First Look:

Megastar Chiranjeevi First Look As Bhola Shankar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ