ఈమధ్యన వరస హిట్స్ తో యంగ్ హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన కృతి శెట్టి.. ఇప్పుడు బాలకృష్ణ సినిమానే రిజెక్ట్ చేసింది అనే న్యూస్ నందమూరి ఫాన్స్ కి కోపం తెప్పిస్తుంది. ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు మూవీ హిట్స్ తర్వాత నితిన్ తో మాచవరం నియోజక వర్గం, సుధీర్ బాబు తో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ పోతినేని తో ద వారియర్ మూవీస్ చేస్తుంది. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిన కృతి శెట్టి కి బాలకృష్ణ - గోపీచంద్ మూవీలో లో ఆఫర్ వచ్చిందట.
బాలయ్యకి కూతురు కేరెక్టర్ లో కృతి శెట్టి నటించబోతుంది అంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు కృతి శెట్టి బాలయ్య మూవీ కి నో చెప్పిందట. మరి ఇందులో నిజమెంతుందో కానీ.. కృతి శెట్టి బాలకృష్ణ కి హ్యాండ్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో NBK107 లో నటిస్తున్నారు. తర్వాత అనిల్ రావిపూడి లైన్ లో ఉన్నారు.