లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు జెట్ స్పీడులో సినిమాలు చేస్తుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రష్మిక చేసిన తెలుగు సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఆ సినిమాలో శర్వా కి జోడిగా క్యూట్ గా, ట్రెడిషనల్ గా, గ్లామర్ గా కనిపించబోతున్న రష్మిక.. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనగా.. ఆమెకి విజయ్ దేవరకొండ తో ప్రేమ, పెళ్లి విషయమై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇంతకుముందు విజయ్ దేవరకొండ కూడా రష్మిక తో తనకి ప్రేమ, పెళ్లి విషయమై కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు రష్మిక కూడా విజయ్ తో ప్రేమ, పెళ్లి విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
తనపై వచ్చే రూమర్స్ చూసి, అలాగే పెళ్లి వార్తలు చూసుకుని నవ్వుకుంటూ ఉంటాను అని, ఇలాంటి వార్తలు తనకి కొత్త కాదని, ఆ వార్తలు వచ్చినప్పుడల్లా నవ్వుకోవడం అలవాటైపోయింది అని, కానీ ప్రస్తుతం తనదగ్గర ప్రేమించి పెళ్లి చేసుకునేంత సమయం లేదని రష్మిక.. తన పెళ్లి పై మరోసారి ఫుల్ క్లారిటీ చేసింది.