పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవడంతో.. పవన్ తనతదుపరి మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ కి షిఫ్ట్ అవ్వనున్నారు. భీమ్లా నాయక్ సక్సెస్ లో ప్రవేట్ పార్టీ చేసుకుంది టీం. అందులో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్, అలాగే హరీష్ శంకర్, వకీల్ సాబ్ డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. అయితే హరి హర వీరమల్లు తో పాటుగా హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి మూవీ లైన్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్ట్స్ తో బిజీ కాబోతున్న పవన్ కళ్యాణ్ తన తదుపరి మూవీ ఓ యంగ్ డైరెక్టర్ తో చేయబోతున్నారనే న్యూస్ మొదలయ్యింది.
అది రన్ రాజా రన్ తో దర్శకుడిగా ప్రూవ్ చేసుకుని సాహో లాంటి పాన్ ఇండియా మూవీ చేసిన సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియా టాక్. అది కూడా తమిళంలో విజయ్ నటించిన తెరి సినిమాని పవన్ హీరోగా సుజిత్ రీమేక్ చేయబోతున్నాడని, ఈ సినిమాని దానయ్య నిర్మించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్.. వరస రీమేక్స్ తో ఈమధ్యన హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు. ఆయన వకీల్ సాబ్ పింక్ రీమేక్, భీమ్లా నాయక్ అయ్యపనుమ్ కోషియం రీమేక్. ఇప్పుడు మరో రీమేక్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. లేదా అనేది మాత్రం అఫీషియల్ ప్రకటన వచ్చేవరకు ఫాన్స్ కి కన్ఫ్యూషనే.