Advertisementt

3 రోజుల్లోనే భీమ్లా 100 కోట్లు దాటేసాడట.!

Mon 28th Feb 2022 12:02 PM
bheemla nayak enters in to the 100 crores club,bheemla nayak first weekend collections,bheemla nayak revenue report,bheemla nayak records,bheemla nayak 3 days collections  3 రోజుల్లోనే భీమ్లా 100 కోట్లు దాటేసాడట.!
Bheemla Nayak Enters The 100 Crores Club 3 రోజుల్లోనే భీమ్లా 100 కోట్లు దాటేసాడట.!
Advertisement
Ads by CJ

ఓ రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఇతర ప్రాంతాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ పవర్ మరోసారి ప్రూవ్ అయింది. బాక్సాఫీస్ కలెక్షన్స్ లో భీమ్లా నాయక్ ర్యాంపేజ్ ఎక్కడికక్కడ కోట్లు కొల్లగొట్టేసే రేంజ్ లో కొనసాగుతోంది. అన్నిచోట్లా వసూళ్లు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మొత్తానికి అభిమాన ప్రేక్షకుల అపూర్వ ఆదరణ ఫలితంగా మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు భీమ్లా నాయక్. అవరోధాలను తట్టుకుని మరీ ఇలా అనూహ్యమైన వసూళ్లతో దూసుకుపోతున్న భీమ్లా గతంలో వచ్చిన బాహుబలి సిరీస్, సాహూ, పుష్ప సినిమాల తరువాత టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100 క్రోర్స్ గ్రాసర్ గా నిలిచిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే ఈ జాబితాలో టాప్ ఫోర్ మూవీస్ పాన్ ఇండియా సినిమాలైతే భీమ్లా నాయక్ మాత్రం కేవలం రీజనల్ సినిమాగానే రిలీజ్ కావడం, అందులోనూ రీమేక్ అయి ఉండీ ఈ ఫీట్ అఛీవ్ చేయడం గ్రేట్ అని చెప్పాలి. 

ఇక ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే...

AP/TS Day 1 : 37.50Cr

AP/TS Day 2 : 21.14Cr

AP/TS Day 3 : 22.30Cr

కర్ణాటక (3 డేస్ ) : 7.09Cr

రెస్టాఫ్ ఇండియా : 1.10 Cr

ఓవర్సీస్ : 15.25Cr

టోటల్ గా మొదటి మూడు రోజుల భీమ్లా కలెక్షన్ : 104.38Cr

(ఇది సమాచారం మాత్రమే. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది)

Bheemla Nayak Enters The 100 Crores Club:

Bheemla Nayak Collected More Than 100 Crores in First Weekend

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ