Advertisementt

నిత్య సౌండ్ వినిపించడం లేదే..

Mon 28th Feb 2022 10:42 AM
nithya menon,bheemla nayak,pawan kalyan,rana,samyukta mneon  నిత్య సౌండ్ వినిపించడం లేదే..
Why Nithya Menon out from Bheemla Nayak promotion? నిత్య సౌండ్ వినిపించడం లేదే..
Advertisement
Ads by CJ

నాయక్ భార్య అంటే ఆయనలో సగం అనుకుంటున్నారా.. కాదు భీమ్లాకి డబుల్ అంటూ డైలాగ్స్ పేల్చిన నిత్యా మీనన్ సౌండ్స్ భీమ్లా నాయక్ ప్రమోషన్స్ లో ఎక్కడా వినిపించ లేదు, కనిపించ లేదు. భీమ్లా లో నిత్యాది చిన్న కేరెక్టర్ ఏమి కాదు.. భీమ్లా నాయక్ ని ఎప్పుడూ గొడవ పడమని చెబుతూ ఎంకరేజ్ చేస్తుంటుంది. అంతంతమాత్రం ప్రమోషన్స్ తో సినిమా రిలీజ్ అయ్యింది. పెద్ద ఎత్తున పవన్ ఫాన్స్ మధ్యన, కేటీఆర్ గెస్ట్ గా జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నిత్యా మీనన్ అటెంట్ అవ్వలేదు. అలాగే సినిమా రిలీజ్ అయ్యి సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చాక కూడా నిత్యా సందడి లేదు. కనీసం సక్సెస్ మీట్ లో అయినా నిత్య ఉంటుంది అని ఎక్సపెక్ట్ చేసిన వారికి నిరాశే మిగిలింది. 

అదే సినిమాలో నటించిన మరో హీరోయిన్, రానా వైఫ్ కేరెక్టర్ చేసిన సంయుక్త మీనన్ మాత్రం భీమ్లా ఈవెంట్ ఎక్కడ ఉంటే అక్కడ గ్లామర్ గా వాలిపోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్, ఆఖరికి సినిమా రిలీజ్ అయిన సాయంత్రం నాగ వంశి ఆఫీస్ లో జరిగిన కేక్ కటింగ్ సెలెబ్రేషన్స్ కి కూడా సంయుక్త వచ్చేసింది. కానీ నిత్య జడ మాత్రం లేదు. మరి ఆహా ఓటిటి లో రాబోతున్న ఇండియన్ ఐడల్ తెలుగు ఆడిషన్స్ కి జేడ్జ్ గా పాల్గొనడానికి నిత్యా మీనన్ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటుంది. కాకపోతే భీమ్లా నాయక్ నే ఎందుకో నిత్య లైట్ తీసుకుంది.   

Why Nithya Menon out from Bheemla Nayak promotion?:

Why Is Nithya Menen Missing At Bheemla Events?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ