గత ఏడాదిన్నరగా విజయ్ దేవరకొండ లైగర్ మూవీ కోసం లైగర్ లుక్ నే మెయింటింగ్ చేస్తున్నాడు. హెయిర్ బాగా పెంచేసి.. లాంగ్ హెయిర్ తో, సిక్స్ ప్యాక్ బాడీతో ఓ బాక్సర్ గా లైగర్ లుక్ లో తిరుగుతున్నాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ లు లైగర్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసారు. ఆగష్టు లో రిలీజ్ కాబోయే లైగర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో చెయ్యబోయే జనగణమన మూవీ స్క్రిప్ట్ లో బిజీ అయ్యారు. ఏప్రిల్ నుండి జనగణమన షూటింగ్ సౌత్ ఆఫ్రికాలో మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.
అయితే కొన్నాళ్లుగా లైగర్ లుక్ నే మెయింటింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా లుక్ మార్చేశాడు. అంటే లాంగ్ హెయిర్ ని తీసేసాడు. గుండు చేయించుకుని క్యాప్ పెట్టుకుని తిరుగుతున్నాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ గచ్చిబౌలి లోని ఇండోర్ స్టేడియం లో జరిగిన వాలీబాల్ మ్యాచ్ లో గెలిచిన టీం కి ట్రోఫీ ఇచ్చేందుకు బయటికి రాగా.. విజయ్ దేవరకొండ కొత్త లుక్ రివీల్ అయ్యింది. మదర్ అండ్ తన బ్రదర్ ఆనంద్ దేవరకొండ తో కలిసి అక్కడికి వెళ్లిన విజయ్.. గుండు తో, ఎల్లో క్యాప్ తో కొత్తగా కనిపించాడు. విజయ్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.