పవన్ కళ్యాణ్ - రానా భీమ్లా నాయక్ తో భారీ హిట్ కొట్టారు. పవన్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించారు. భీమ్లా నాయక్ థియేటర్స్ దగ్గర మాస్ ఆడియన్స్ జాతర తలపించేలా పండగ చేసుకుంటున్నారు. థియేటర్స్ లో విజిల్స్ వేస్తూ రచ్చ చేస్తున్నారు. మరి అంతటి బ్లాక్ బస్టర్ వస్తే.. భీమ్లా మేకర్స్ ఊరుకుంటారా.. అందుకే అదిరిపోయే పార్టీ ఇచ్చేసారు. గత రాత్రి హైదరాబాద్ భీమ్లా నాయక్ టీం అంతా సక్సెస్ పార్టీలో మునిగితేలిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ కూడా హాజరవడం విశేషం.
అంటే భీమ్లా నాయక్ సక్సె మీట్ ని అవాయిడ్ చేసిన పవన్ కళ్యాణ్ అదే రోజు రాత్రి జరిగిన ప్రవేట్ పార్టీకి హాజరవడమే కాదు.. ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ సూపర్ స్టైలిష్ గా చాలా బాగా ఎంజాయ్ చేసినట్లుగా, తనకి అంత పెద్ద హిట్ ఇచ్చిన తన ఫ్రెండ్ త్రివిక్రమ్ ని హగ్ చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా భీమ్లా నాయక్ లో నటించిన వారు, టెక్నీకల్ టీం అంతా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసారని, హైపర్ ఆది పవన్ తో ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ కూడా చేసాడు.