Advertisementt

భీమ్లా ముందు చేతులెత్తేసిన అలియా

Sun 27th Feb 2022 01:12 PM
gangubai kathiyawadi,pawan kalyan,bheemla nayak,alia bhatt,rana - pawan kalyan,rrr beauty  భీమ్లా ముందు చేతులెత్తేసిన అలియా
Gangubai to compete with Bheemla Nayak భీమ్లా ముందు చేతులెత్తేసిన అలియా
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో భీభత్సమైన హిట్ కొట్టారు. పవన్ - రానా ఒకరిపైఒకరు నువ్వా నేనా అని పోటీ పడ్డ భీమ్లా నాయక్ థియేటర్స్ దగ్గర కూడా ఆ రేంజ్ కసితో బాక్సాఫీసుని షేక్ చేస్తుంది. అటు సెలబ్రిటీస్ నుండి భీమ్లా నాయక్ కి కాంప్లిమెంట్స్ మీద కాంప్లిమెంట్స్ దక్కుతున్నాయి. ఇటు ఆడియన్స్ జై భీమ్లా నాయక్ అంటూ గోల గోల చేస్తున్నారు. భీమ్లా నాయక్ తో పాటుగా అదే రోజు రిలీజ్ అయిన.. ఆర్.ఆర్.ఆర్ భామ అలియా భట్ గంగూబాయి కతీయవాడి సందడి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు.

గంగూబాయి విడుదలకు ముందు అందరూ ఆర్.ఆర్.ఆర్ భామ నటిస్తున్న చిత్రం.. ఇది హిట్ అయితే ఆర్.ఆర్.ఆర్ కి బాగా కలిసొస్తుంది అని మట్లాడుకున్నా.. సినిమా రిలీజ్ అయ్యాక భీమ్లా జాతరలో అలియా గురించి మాట్లాడుకోవడమే లేదు. గంగూబాయి కతీయవాడిలో అలియా భట్ అదిరిపోయే పెరఫార్మెన్స్ తో అదరగొట్టింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. అలియా భట్ మాత్రం అందం, అభినయం తో ఆకర్షించింది. కానీ భీమ్లా నాయక్ ముందు గంగూబాయి వెల వెల బోయింది. అదే గనక భీమ్లా నాయక్ తో పోటీ లేకపోయుంటే.. ఆర్.ఆర్.ఆర్ లో నటించిన అలియా భట్ మూవీ గంగూబాయి ని ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫాన్స్ ఖచ్చితంగా హిట్ చేసేవారే.

Gangubai to compete with Bheemla Nayak:

Bheemla Nayak vs Gangubai Kathiyawadi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ