Advertisementt

పవర్ స్టార్ భీమ్లా కి సూపర్ స్టార్ ప్రశంసలు

Sat 26th Feb 2022 09:37 PM
mahesh babu,pawan kalyan,rana,bheemla nayak,trivikram,mahesh babu on pawan kalyan,mahesh babu on bheemla nayak  పవర్ స్టార్ భీమ్లా కి సూపర్ స్టార్ ప్రశంసలు
Mahesh Babu tweets on Bheemla Nayak పవర్ స్టార్ భీమ్లా కి సూపర్ స్టార్ ప్రశంసలు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ కి మహేష్ బాబు కి ఉన్న బాండింగ్ అందరికి తెలిసిందే. మొదటి నుండి మహేష్, పవన్ ఇద్దరూ ఒకరికొకరు తోట్పాటు అందించుకుంటూ ఉంటారు. వీరిద్దరి కాంప్లిమెంటింగ్ నేచర్ ఇద్దరి ఫాన్స్ కి విపరీతంగా నచ్చుతుంది. ప్రతి ఫెస్టివల్ కి పవన్ కళ్యాణ్ నుండి మహేష్ బాబు కి గిఫ్ట్స్ వెళ్లడం, వాటిని మహేష్ వైఫ్ నమ్రత సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. గత ఏడాది వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ట్వీట్స్ రూపం లో ప్రశంసిస్తూ వెల్ కమ్ చేసారు మహేష్. 

మళ్ళీ ఇప్పుడు భీమ్లా నాయక్ పట్ల తన స్పందన తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపించారు మహేష్. భీమ్లా నాయక్ ఉవ్వెత్తున ఎగసిపడే పవర్ ప్యాకెడ్ కేరెక్టర్ లో పవన్ కళ్యాణ్ పెరఫార్మెన్స్ సూపర్ అని, ఆయన ఫైర్ ఫామ్ లో ఉన్నారని, డ్యానియల్ శేఖర్ గా రానా స్క్రీన్ పెజెన్స్ సంచలనం అంటూ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇక తన నెక్స్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ షార్ప్ ఇంకా బ్రిలియెంట్ రైటింగ్ తో ఎప్పటిలాగే.. ద బెస్ట్ ఇచ్చారు. తన సర్కారు వారి పాటకి మ్యూజిక్ అందిస్తున్న థమన్ భీమ్లాకి ఇచ్చిన మ్యూజిక్ మిమ్మల్ని మంత్రం ముగ్దుల్ని చేస్తుంది అని.. ప్రత్యేకంగా పొగిడారు. ఇక డైరెక్టర్ సాగర్ కి, నిర్మాత నాగ వంశీ, తనకెంతో ఇష్టమైన డీఓపి అండ్ ఎంటైర్ టీం కి మహేష్ బాబు కంగ్రాట్స్ అంటూ ట్వీట్స్ చేసారు. 

Mahesh Babu tweets on Bheemla Nayak:

Mahesh Babu feels Bheemla Nayak power

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ