టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ జాతర ఆల్మోస్ట్ ముగిసింది. నిన్న శుక్రవారం విడుదలైన భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్స్ దగ్గర సందడి చేస్తుంది. నిన్నటివరకు భీమ్లా నాయక్ అప్ డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. త్రివిక్రమ్ గారు భీమ్లా నాయక్ సక్సెస్ మీట్ లో చెప్పినట్లుగా మీడియా మొత్తం భీమ్లానాయక్ ప్రమోషన్స్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి గట్టిగా ప్రయత్నం చేసింది. అంటే మీడియా భీమ్లా ని భుజాన మోసింది. ఇక భీమ్లా నాయక్ హిట్ అయ్యింది. ఓ నాలుగైదు రోజులు భీమ్లా నాయక్ రెవిన్యూ జాతర కనబడుతుంది మీడియాలో అంతే.
ఇక ఇప్పుడు రాధే శ్యామ్ రచ్చ స్టార్ట్ అవ్వబోతుంది. మరో రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న రాధే శ్యామ్ పాన్ ఇండియా ఫిలిం ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. ఇప్పుడు భీమ్లా నుండి మీడియా రాధే శ్యామ్ వైపు డైవర్ట్ అవుతుంది. మీడియా, సోషల్ మీడియా మొత్తం రాధే శ్యామ్ పై ఫోకస్ పెడుతుంది. రాధే శ్యామ్ అప్ డేట్స్ ని ట్రెండ్ చేస్తాయి. అటు ప్రభాస్ ఫాన్స్ కూడా రాధే శ్యామ్ సక్సెస్ కోసం పాటు పడతారు. రాధే శ్యామ్ నుండి వచ్చే ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ని ప్రేక్షకుల్లోకి చేరవేయడానికి మీడియా రెడీ.. మార్చి 11 వరకు ఎక్కడ చూసినా రాధే శ్యామ్ జాతరే.