సీఎం హోదాలో ఉన్న ఓ వ్యక్తి రాజకీయంగా ఓ హీరోని అణచడం కోసం తన స్థాయిని మరిచి ప్రవర్తించిన తీరు ఇప్పుడు సర్వత్రా తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయంగా వీకో, స్ట్రాంగో.. అలా అని అతని ప్రొఫెషన్ మీద సీఎం స్థాయి వ్యక్తి దెబ్బకొట్టడం.. రాజకీయంగా అణిచెయ్యాలని చూడడం ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఇదే ఏపీ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. స్టార్ హీరోలయినా, చిన్న హీరోలయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని రిలీజ్ చేసుకుంటారు. వారి ప్రమోషన్స్ వారివి.. వారి లాభాలు వారివి.. నష్టాలైనా వారే భరిస్తారు కానీ.. అది సీఎం జగన్ అయితే భరించరు కదా. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద వైసిపి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుంది అనేది అందరికి తేట తెల్లమైంది.
వకీల్ సాబ్ సినిమా అప్పుడే టికెట్ రేట్స్ అనూహ్యంగా తగ్గించి పవన్ ని దెబ్బకొట్టారు. మళ్ళీ మధ్యలో పుష్ప, శ్యామ్ సింగ రాయ్, అఖండ లాంటి పెద్ద సినిమాలు వచ్చాయి తక్కువ రేట్స్ అయినా అవి ఆడాయి.. హిట్ అయ్యాయి వెళ్లిపోయాయి. కానీ మళ్ళీ పవన్ భీమ్లా నాయక్ సినిమా వచ్చేటప్పటికి.. జగన్ ప్రభుత్వం మొండి పట్టుదలకి పోయి రెవిన్యూ అధికారులతో సోదాలు, థియేటర్స్ సీజ్, ఏకంగా పోలీస్ లని రంగంలోకి దింపడం.. వంటి విషయాలతో బాగా బాడ్ అయ్యింది. రాజకీయంగా పవన్ ని ఎదుర్కోలేమేమో అనేకదా.. ఇలాంటి పనులు చేసేది. పవన్ నిజంగా స్ట్రాంగ్ అని జగన్ ఫీల్ అవుతున్నారా? లేదంటే మారేదన్నానా? ఇక్కడ పవన్ హీరో అయితే.. జగన్ జీరో అయ్యారు. ఆఖరికి జగన్ భజన చేసే వారే జగన్ కి ఓ సలహా పడేస్తున్నారు.
జగన్ గారు మీ స్థాయిని మరిచి ప్రవర్తించి పవన్ కళ్యాణ్ ని అనవరసరంగా హీరోని చేసారు అంటూ.. ఒకవేళ మీరు భీమ్లా నాయక్ విషయంలో అలా మొండిగా ఉన్నా ఏం చేసారు. ఏం చేయగలిగారు. కొన్ని చోట్ల ఆంధ్రలో బ్లాక్ దందా నడిచింది. దాన్ని ఆదుకోలేకపోయారు. అఖండ, శ్యామ్ సింగ రాయ్ అప్పుడు కామ్ గా ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు భీమ్లా విషయంలోనూ అలా ఉంటే సరిపోయేది. తెలంగాణాలో వదిలేసినట్టుగా మీరూ వదిలెయ్యాల్సింది. అనవసరంగా భీమ్లా విషయంలో తప్పు చేసారు.. పవన్ ని ఏకంగా హీరోని చేసారు.. ఇది మీకు అవసరమా అంటూ జగన్ భజనాపరులే మాట్లాడుకోవడం విచిత్రమే అయినప్పటికీ.. తప్పు ని ఎవరైనా తప్పు అనాల్సిందేగా.. అది ఒప్పుకోవాల్సిందే.