Advertisementt

షణ్ముఖ్ కి బ్లాంక్ చెక్ ఇచ్చిన సితార నాగ వంశీ

Fri 25th Feb 2022 08:14 PM
bigg boss,shanmukh interview,shanmukh,sitara entertainment,naga vamshi  షణ్ముఖ్ కి బ్లాంక్ చెక్ ఇచ్చిన సితార నాగ వంశీ
Sithara Naga Vamsi gave a blank check to Shanmukh షణ్ముఖ్ కి బ్లాంక్ చెక్ ఇచ్చిన సితార నాగ వంశీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కన్నా ముందే సోషల్ మీడియాలో సాఫ్ట్ వెర్ డెవెలెపర్స్, సూర్య వెబ్ సీరీస్ తో విపరీతమైన పాపులారిటీ మూటగట్టుకున్నా షణ్ముఖ్ జస్వంత్.. బిగ్ బాస్ తర్వాత సైలెంట్ అయ్యాడు. బిగ్ బాస్ నెగెటివిటి నుండి బయటపడడానికి అతను కనీసం ఎవరికీ ఓ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. షణ్ముఖ్ ని బిగ్ బాస్ అంతాగా బాడ్ చేసింది. అయితే తాను చేసిందే బిగ్ బాస్ లో చూపించారు కానీ, తాను ఏం చెయ్యకపోయినా బిగ్ బాస్ లో చూపించరు. అది నా తప్పే అంటూ షణ్ముఖ్ స్వయంగా ఒప్పేసుకున్నాడు. బిగ్ బాస్ వాళ్ళది తప్పేం లేదు అని... తాను చేసింది మాత్రమే వాళ్ళు చూపించారంటూ షణ్ముఖ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

అయితే సాఫ్ట్ వెర్ డెవెలెపర్స్ వెబ్ సీరీస్ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీ గారు పిలిచి ఆ వెబ్ సీరీస్ చూసి మెచ్చుకుని తనతో సినిమా చెయ్యడానికి అప్పటికప్పుడే సాఫ్ట్ వెర్ డెవలెపర్స్ దర్శకుడికి నాకు రెండు బ్లాంక్ చెక్స్ ఇచ్చారు. దానితో తాను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను అని, ఎంతోకొంత వాళ్ళని శాటిస్ ఫై చేయగలిగాను అని, ఆ బ్లాంక్ చెక్ ఇప్పుడు చెల్లకపోయినా.. అది తన దగ్గరా భద్రంగా ఉంది అని, ఎప్పటికైనా నాగ వంశీ గారి బ్యానర్ లో చేస్తాను అని, అంత పెద్ద బ్యానేర్ లో తనకి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ షణ్ముఖ్ ఈ మధ్యన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

Sithara Naga Vamsi gave a blank check to Shanmukh:

Bigg Boss Shanmukh interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ