Advertisementt

ఏపీ మంత్రులకి చుక్కలు చూపించిన పవన్ ఫాన్స్

Fri 25th Feb 2022 12:50 PM
kodali nani and perni nani faced protest from pawan kalyan fans at bheemla nayak theater in gudivada  ఏపీ మంత్రులకి చుక్కలు చూపించిన పవన్ ఫాన్స్
Ministers Perni Nani and Kodali Nani blocked by Pawan Fans ఏపీ మంత్రులకి చుక్కలు చూపించిన పవన్ ఫాన్స్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఏపీలో పవన్ ఫాన్స్ ఏపీ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీకి బెన్ ఫిట్ షోస్ లేకుండా, ఐదో ఆటకి అనుమతి ఇవ్వకుండా, టికెట్ రేట్స్ పెంచకుండా చేస్తూ.. పవన్ కళ్యాణ్ ని కావాలనే ఇబ్బందులు పెడుతున్నారంటూ వారు ఏపీ సీఎం జగన్, మంత్రి పేర్ని నాని పై ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా కొన్ని థియేటర్స్ దగ్గర భీమ్లా నాయక్ షోస్ పడలేదు. ఇంత తక్కువ టికెట్ రేట్స్ కి థియేటర్స్ నడపలేమంటూ భీమ్లా నాయక్ రిలీజ్ చేయలేమని థియేటర్స్ యాజమాన్యాలు బోర్డు లు తగిలించడంతో పవన్ ఫాన్స్ మరింతగా రెచ్చిపోతున్నారు.

తాజాగా ఏపీ మంత్రులైన కొడాలి నాని, పేర్ని నాని లకి పవన్ ఫాన్స్ ఆల్మోస్ట్ చుక్కలు చూపించారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ ఇష్యు నేపథ్యంలో మంత్రులు ఇద్దరూ కృష్ణ జిల్లాలోని గుడివాడలో ఓ థియేటర్ ఓపెనింగ్ కి రాగా.. అక్కడ పవన్ ఫాన్స్ గందర గోళం సృష్టించారు. థియేటర్ ని ఓపెన్ చెయ్యకుండా అడ్డుకోవాలని, జనసేన కార్యకర్తలు, పవన్ ఫాన్స్ ప్రయత్నం చేసారు. మంత్రి పేర్ని నాని, కొడాలి నాని డౌన్ డౌన్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ రచ్చ చేసారు. దానితో పోలీస్ లు ఫాన్స్ ని అరెస్ట్ చెయ్యడంతో.. అక్కడ గొడవ సద్దుమణిగింది. పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలు చేపట్టింది అంటూ పవన్ ఫాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. 

Ministers Perni Nani and Kodali Nani blocked by Pawan Fans:

Kodali Nani and Perni Nani faced Protest from Pawan Kalyan fans at Bheemla Nayak theater in Gudivada

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ