Advertisementt

పుష్ప ద రూల్ అలా ఉండబోతుందా..?

Fri 25th Feb 2022 12:29 PM
pushpa the rule,allu arjun,sukumar,bollywood,pushpa the rule update,rashmika,fahad fasil  పుష్ప ద రూల్ అలా ఉండబోతుందా..?
Pushpa The Rule Update పుష్ప ద రూల్ అలా ఉండబోతుందా..?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప ద రైజ్ అన్ని భాషల్లోనూ అఖండ విజయం సాధించింది. హిందీ లో అయితే అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ తోనే 100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటన, ఆయన స్లాంగ్, సుకుమార్ మేకింగ్ సినిమాని హిట్ చేసాయి. ఇక మార్చ్ మొదటి వారం నుండి పుష్ప ద రూల్ షూటింగ్ మొదలు పెట్టేందుకు టీం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే లొకేషన్స్ వేటలో సుక్కు బిజీగా గడుపుతున్నారు. అనుకున్నట్టుగా షూటింగ్ మొదలై.. అనుకున్న టైం కే షూటింగ్ కంప్లీట్ కావాలని అల్లు అర్జున్ చెప్పినట్టుగా ఈమధ్యనే వార్తలొచ్చాయి.

అందుకే సుకుమార్ ముందే లొకేషన్స్ అన్ని చూసుకుని రంగంలోకి దిగాలనుకుంటున్నారట. హిందీలో సక్సెస్ అయిన పుష్ప కి ఈసారి.. అక్కడి వాతావరణం, అక్కడి లొకేషన్స్, అలాగే బాలీవుడ్ నుండి కూడా సెకండ్ పార్ట్ కోసం కొంతమంది నటులని ప్రత్యేకంగా తీసుకోబోతున్నారట. అలా నార్త్ ప్రేక్షకులకి మరింతగా సినిమాపై క్రేజ్ పెంచొచ్చు అని వారి ఆలోచనగా తెలుస్తుంది. ఇక పార్ట్ 2 లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా స్మగ్లింగ్ లో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకొని, అందరిని శాసిస్తాడని, విలన్ గా ఫహద్ ఫాసిల్ కి - పుష్ప రాజ్ కి మధ్యన భారీ యాక్షన్ సీన్స్  ఉండేలా సుక్కు ప్లాన్ చేశారట. అవే సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది. 

Pushpa The Rule Update:

Allu Arjun - Sukumar Pushpa The Rule Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ