ఇపుడు ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ అంతా భీమ్లా నాయక్ మానియాతో ఊగిపోతున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా పెద్ద సినిమాల రిలీజ్ లు ఆగిపోవడం, మళ్ళీ సాధారణ పరిస్థితికి వచ్చాక విడుదలవుతున్న బిగ్ బడ్జెట్ మూవీ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కావడంతో.. ఫాన్స్ అయితే లాలా.. భీమ్లా అంటూ పూనకాలతో ఊగిపోతున్నారు. ఫాన్స్ రచ్చ, ట్రేడ్ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ హడావిడి గత రాత్రే ఓవర్సీస్ లో మొదలైపోయింది. గత రాత్రి నుండి యుఎస్ ప్రీమియర్ షోస్ అంటూ ఆడియన్స్ అక్కడ సినిమా చూసి.. ఇక్కడ ఇండియా లో అప్ డేట్స్ ఇస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
అంతేకాకుండా హైదరాబాద్ లో కూడా అర్ధరాత్రి నుండే పవన్ ఫాన్స్ రచ్చ షురూ చేసారు. కూకట్ పల్లిలోని కొన్ని థియేటర్స్ లో భీమ్లా నాయక్ ఎర్లీ ప్రీమియర్స్ స్టార్ట్ అవడంతో పవన్ ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరిపోయింది అని, రానా దగ్గుబాటి సెటిల్డ్ పెర్ఫామెన్స్, పవన్ కళ్యాణ్ స్వాగ్, థమన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్, సాగర్ డైరెక్షన్, ఎక్సలెంట్ క్లయిమాక్స్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ ఫస్ట్ హాఫ్ కన్నా.. సెకండ్ హాఫ్ అదిరింది అని, సెకండ్స్ హాఫ్ అంచనాలకు మించి ఉంది అని, అలాగే యాక్షన్ సన్నివేశాల్లో లాడ్జ్ ఫైట్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించడం ఖాయమని, ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్యలో కొనసాగే ఈ యుద్ధంలో పవన్ - రానా నువ్వానేనా అన్నట్లుగా పెరఫార్మెన్స్ ఇచ్చారని, థమన్ అందించిన పాటలు ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు.
కొంతమంది ఆడియన్స్ అయితే యాటిట్యూడ్ చూపించడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వారు లేరంటూ కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ - రానా సీన్స్, పవన్ కళ్యాణ్‌కు పెట్టిన డైలాగ్స్ తో థియేటర్లో ఫ్యాన్స్ విజిల్స్‌తో మోత మోగించడం ఖాయం అని, ఒక్క మాటలో చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ అంటూ ఓవర్సీస్ నుండి టాక్ స్ప్రెడ్ అయ్యింది.
.