Advertisementt

బిగ్ బాస్ ఓటిటిలోకి ఆ హీరోయిన్

Thu 24th Feb 2022 10:00 PM
bindu madhavi,bigg boss,bigg boss telugu ott,nagarjuna,telugu heroine bindu madhavi  బిగ్ బాస్ ఓటిటిలోకి ఆ హీరోయిన్
Bindu Madhavi to entertain in Bigg Boss Telugu OTT బిగ్ బాస్ ఓటిటిలోకి ఆ హీరోయిన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి హాట్ స్టార్ లో ఈ శనివారం మొదలు కాబోతుంది. బిగ్ బాస్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని బుల్లితెర ప్రేక్షకులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మరొక్క రోజులో నాగార్జున హోస్ట్ గా ప్రయోగాత్మకంగా మొదలు కాబోతున్న ఓటిటి బిగ్ బాస్ లోకి ఈసారి క్రేజీ కంటెస్టెంట్స్ అడుగుపెట్టబోతున్నారనే టాక్ ఎప్పటినుండో సోషల్ మీడియాలో నడుస్తుంది. బోల్డ్ బ్యూటీ సరయు, మాజీ కంటెస్టెంట్స్ లో ముమైత్ ఖాన్, అరియనాలాంటి వాళ్ళు వెళుతున్నారని తెలుస్తుంది. అయితే ఈసారి తెలుగు బిగ్ బాస్ ఓటిటిలోకి ఆవకాయ్ బిర్యానీ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. 

ఆవకాయ్ బిర్యానీ, పిల్ల జమిందార్, రామ రామ కృష్ణ కృష్ణ, బంపర్ ఆఫర్ సినిమాలో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బిందు మాధవి కూడా ఈసారి బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలుగు, తమిళంలో హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్న బిందు మాధవి.. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అవ్వాలని చూస్తుందట. అదే గనక జరిగితే.. ఈసారి బిగ్ బాస్ పాపులర్ అవడం ఖాయమనే మాట వినిపిస్తుంది. బిందు మాధవి గ్లామర్ బిగ్ బాస్ ఓటిటికి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందేమో చూడాలి. 

Bindu Madhavi to entertain in Bigg Boss Telugu OTT:

Bindu Madhavi enters Bigg Boss Telugu OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ