రేపు విడుదల కాబోతున్న భీమ్లా నాయక్ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటుతో పాటుగా, ఐదో షో కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ పై ప్రతీకారం తీర్చుకోవడానికి రంగం సిద్ధం చేసేసింది. ఎవరైనా టికెట్ రేట్స్ పెంచి అమ్మితే థియేటర్స్ సీజ్ చేస్తామని, అలాగే భీమ్లా నాయక్ కి ఐదో షో కి అనుమతులు లేవని, ఎక్కడైనా భీమ్లా నాయక్ టికెట్ రేట్స్ పెంచి అమ్మినా, అలాగే ఎక్కువ షోస్ ప్రదర్శించినా ఊరుకోమని.. రెవిన్యూ అధికారులు థియేటర్స్ యాజమాన్యాలకు నోటీసు లు జారీ చేస్తున్నారు.
అటు బెన్ ఫిట్ షోస్ కి అనుమతులు ఇవ్వని కారణంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ విజయవాడ థియేటర్స్ దగ్గర ధర్నాలకు దిగారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా అణగదొక్కడానికే ఏపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంది అని ధ్వజమెత్తుతున్నారు.
ఇక క్రేజీగా కొంతమంది పవన్ ఫాన్స్.. విజయవాడలో బెన్ ఫిట్ షోస్ లేని కారణంగా వారు హైదరాబాద్ కి క్యూ కట్టడం కాస్త విచిత్రంగా ఉంది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చూసేందుకు తాము హైదరాబాద్ వస్తున్నామని, ఏపీ ప్రభుత్వం కావాలనే భీమ్లా నాయక్ ని ఇబ్బంది పెడుతుంది అంటూ వారు మీడియాకి చెప్పడం అందరిని ఆకర్షించింది. రేపు విడుదల కాబోతున్న భీమ్లా నాయక్ ని అన్ని విధాలా నష్టం చేసేందుకు వైసిపి నేతలు ఉన్నట్లుగా పవన్ ఫాన్స్ ఆరోపణలు చేస్తున్నారు.