Advertisementt

బిగ్ బాస్ హంగామా మొదలైపోయింది

Thu 24th Feb 2022 12:54 PM
bigg boss telugu ott,bigg boss,nagarjuna,star maa  బిగ్ బాస్ హంగామా మొదలైపోయింది
The Bigg Boss Telugu OTT Hungama has begun బిగ్ బాస్ హంగామా మొదలైపోయింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఇప్పడు మీ ఓటిటి లో.. అంటూ నాగార్జున పదే పదే స్టార్ మా లోకి వచ్చేసి.. బిగ్ బాస్ తెలుగు ఓటిటి పై హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఓటిటికి కౌన్ డౌన్ మొదలైపోయింది. ఎప్పుడూ ఆదివారం మొదలయ్యే బిగ్ బాస్ ఈసారి శనివారమే మొదలు కాబోతుంది. బిగ్ బాస్ ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తూ శనివారమే మొదలు పెట్టబోతున్నారు. బిగ్ బాస్ ని హాట్ స్టార్ లో 24 గంటలు చూసే అవకాశం ఇచ్చేసింది. ప్రస్తుతం హోస్ట్ నాగార్జున స్టార్ మా బిగ్ బాస్ ఓటిటి అంటూ చెప్పడంతో.. ఆగస్టు, సెప్టెంబర్ లో మొదలు కాబోయే బిగ్ బాస్ హడావిడి అంతా ఇప్పుడు స్టార్ మా లోనే కనబడుతుంది. 

ఇక సోషల్ మీడియాలో అయితే కొంతమంది మాజీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఓటిటి లోకి అడుగుపెడుతున్నారని, అలాగే కొత్త కంటెస్టెంట్స్ పేర్లు కూడా రివీల్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఇక ఆ కంటెస్టెంట్స్ పారితోషకాలు, ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు అనే వివరాలను కూడా చెప్పేస్తున్నారు. గ్లామర్ గర్ల్స్, బోల్డ్ బ్యూటీస్, పేరున్న సెలబ్రిటీస్ హాట్ స్టార్ ఓటిటి బిగ్ బాస్ కోసం రాబోతున్నారని, ప్రస్తుతం వారు క్వారంటైన్ లో ఉన్నారని, 26 శనివారం సాయంత్రం 18 మంది కంటెస్టెంట్స్ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటిటి 85 రోజులపాటు సాగబోతున్నట్లుగా తెలుస్తుంది. 

The Bigg Boss Telugu OTT Hungama has begun:

Bigg Boss Telugu OTT start at Saturday 26th Feb

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ