భీమ్లా నాయక్.. ఆ సినిమా విషయంలో పవన్ పేరు ఎంతగా వినిపిస్తుందో.. అదే టైం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు భీమ్లా నాయక్ విషయంలో అంతగా వినిపిస్తుంది. ఈ సినిమాకి హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు సాగర్ కె చంద్ర. కానీ అక్కడ అంతా తానై, అన్ని తానే అన్నట్టుగా త్రివిక్రమ్ భీమ్లా నాయక్ సినిమా మేకింగ్ విషయంలో వ్యవహరించారు. బడ్జెట్ విషయంలో, సెట్స్ విషయంలో, ఆఖరికి కేటీఆర్ ని ఇన్వైట్ చేసే విషయంలో ఇలా ఎక్కడ చూసినా త్రివిక్రమే కనిపించారు. అందుకే అందరూ భీమ్లా క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ కే అన్నట్టుగా.. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా మొదలు అయినదగ్గరనుండి పూర్తయ్యేవరకు ఆ క్రెడిట్ అంతా త్రివిక్రమ్ దే అని చెప్పారు.
గత రాత్రి జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరూ పవన్ పక్కన ఉండాల్సిన త్రివిక్రమ్ కోసం చాలా వెతికేసారు. ఎందుకంటే పవన్ ఎక్కడ ఉంటే ఆయన అక్కడే ఉంటారు కాబట్టి. కానీ ఆ ఈవెంట్ లో త్రివిక్రమ్ పవన్ కి దూరంగా ఉన్నారు. స్టేజ్ పైకి వచ్చినా.. చాలా త్వరగా కేటీఆర్, పవన్ తో ఫోటో దిగేసి వెళ్లిపోయారు. చాలామందికి ఆయన్ని ఈవెంట్ ఫొటోస్ లో చూసేవరకు తెలియలేదు ఆయన ఈవెంట్ కి వచ్చారనే విషయం. అయితే పవన్ స్పీచ్ లో త్రివిక్రమ్ ని ఓ రేంజ్ లో పొగిడారు. ఈ సినిమా రీమేక్ అవ్వడానికి, మొదలు పెట్టడానికి, పూర్తి చెయ్యడానికి కారణం త్రివిక్రమ్ అని, ఆయన సినిమాకి వెన్నుముక అని, మేకింగ్ విషయం కానివ్వండి, టెక్నీకల్ గా కానివ్వండి, బడ్జెట్ చూసుకోవడం కానివ్వండి.. అన్ని త్రివిక్రమ్ చూసుకోబట్టే ఈ సినిమా సక్రమంగా పూర్తయ్యింది అంటూ భీమ్లా నాయక్ క్రెడిట్ మొత్తం పవన్ త్రివిక్రమ్ కి ఇచ్చేసారు. ఇప్పుడు భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆ క్రెడిట్ పవన్, త్రివిక్రమ్ కె సొంతం..