Advertisementt

జులై 1 న వస్తానంటోన్న వారియర్

Wed 23rd Feb 2022 02:57 PM
ram,ram potineni,lingusamy,the warrior movie,rapo19,krithi sheety  జులై 1 న వస్తానంటోన్న వారియర్
Ram The Warrior release date fixed జులై 1 న వస్తానంటోన్న వారియర్
Advertisement
Ads by CJ

ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని.. ప్రస్తుతం పందెం కోడి ఫేమ్ లింగుసామి దర్శకత్వంలో RAPO19 ద వారియర్ మూవీ ని తెలుగు, తమిళ లో బై లింగువల్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ద వారియర్ నుండి ఈ మధ్యనే హీరోయిన్ కృతి శెట్టి లుక్ ని రివీల్ చేసారు. రామ్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్న ఈ మూవీ లో కృతి శెట్టి విజిల్ మహాలక్ష్మి గా గ్లామర్ పాత్రలో కనిపించబోతుంది. అయితే ద వారియర్ ని మేకర్స్ జులై 1 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. 

తెలుగు, తమిళ్ లో పర్ఫెక్ట్ గా డేట్ ఫిక్స్ చేసి.. అధికారికంగా ప్రకటించాలని చూస్తున్నారు. ప్రస్తుతం విడుదల డేట్స్ లో కొనసాగుతున్న కన్ఫ్యూజన్.. మే ఎండింగ్ కి పూర్తయేలా కనిపించడంతో.. రామ్ - లింగుసామీ లు జులై 1 న ద వారియర్ ని రెండు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయమై ఒకటిరెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక రామ్ ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లుగా ఈ మధ్యనే ప్రకటించారు. 

Ram The Warrior release date fixed:

Ram To Start The War On July 1st

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ