Advertisementt

చిరు-సుక్కు.. లెక్కలు మారిపోతాయ్

Tue 22nd Feb 2022 11:05 PM
chiranjeevi,sukumar,chiru - sukku combo,chiru 156,god father,bhola shankar  చిరు-సుక్కు.. లెక్కలు మారిపోతాయ్
Chiranjeevi-Sukumar ready for a sensation చిరు-సుక్కు.. లెక్కలు మారిపోతాయ్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు లైనప్ మాములుగా లేదు. వరస ప్రాజెక్ట్స్ తో డదడలాడిస్తున్నారు. యంగ్ హీరోల మాదిరి వరస సినిమాలతో చాలా ఆక్టివ్ గా కనిపిస్తున్నారు. కొరటాల తో ఆచార్య ని రిలీజ్ కి సిద్ధం చేసేసిన చిరు.. గాడ్ ఫాదర్ షూటింగ్ ని ఫినిషింగ్ కి తీసుకు వచ్చారు. భోళా శంకర్ షూటింగ్స్ ని పారలల్ గా చేస్తున్నారు. అలాగే బాబీ ప్రాజెక్ట్ తో పాటుగా వెంకీ కుడుములు ప్రాజెక్ట్ ఉండనే ఉంది. అంతలోనే చిరు మరో డైరెక్టర్ కి కమిట్మెంట్ ఇచ్చేశారు. అది కూడా లెక్కల మాస్టర్ సుక్కు కి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభంజనం సృష్టించిన సుకుమార్ తో చిరు మెగా ప్రాజెక్ట్ ఉండబోతున్నట్లుగా సుకుమార్ అఫీషియల్ గా ప్రకటించారు. 

లెక్కల మాస్టర్ డైరెక్షన్ లో చిరు మూవీ అంటే లెక్కలు మారిపోవడం ఖాయం అంటున్నారు మెగా ఫాన్స్. అయితే ఇటు చిరుకి వరస కమిట్మెంట్స్ ఉన్నాయి. అటు సుకుమార్ కి పుష్ప 2 తర్వాత విజయ్ దేవరకొండ తో మూవీ చెయ్యాల్సిన కమిట్మెంట్ ఉంది. మరి చిరు కమిట్మెంట్స్ ఎప్పుడు పూర్తవ్వాలి.. సుకుమార్ కి చిరు డేట్స్ ఎప్పుడు ఇవ్వాలి.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కావాలి అనేది ఇప్పుడు ఫాన్స్ మైండ్ లో నడుస్తున్న అతి పెద్ద ప్రశ్న. 

ఎప్పుడైనా జరగనీ ఇప్పటికైతే ఆ ఊహే చాలు.. అల్టిమేట్ గా బాక్సాఫీస్ లెక్కలన్నిటికీ చుక్కలు చూపించేస్తారు మన మెగాస్టారు - మ్యాథ్స్ మాస్టారు కలిస్తే.! 

 

Chiranjeevi-Sukumar ready for a sensation:

Chiranjeevi sensation with Sukumar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ