Advertisementt

లుక్స్ తో భయపెట్టే బాలయ్య.. ఈసారి మాత్రం

Tue 22nd Feb 2022 01:10 PM
balakrishna,nbk 107 look,veerabhadra lok,maharadhi look,balayya stylish avatar,boyapti movies  లుక్స్ తో భయపెట్టే బాలయ్య.. ఈసారి మాత్రం
Hot topic on Balayya stylish looks లుక్స్ తో భయపెట్టే బాలయ్య.. ఈసారి మాత్రం
Advertisement
Ads by CJ

బాలయ్య కాస్త బబ్లీ గా ఉన్నా ఆయన డాన్స్ ల విషయంలోనూ, అలాగే యాక్షన్ సన్నివేశాల్లోను చాలా ఎనర్జిటిక్ గా ఉత్సాహంగా ఉంటారు. ఈమధ్యన బాలకృష్ణ స్టైలిష్ అవతార్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే బాలకృష్ణ విగ్ విషయంలో పర్టిక్యులర్ గా కేర్ తీసుకున్నా, అలాగే లుక్స్ విషయంలో శ్రద్ద పెట్టినా.. కొన్ని సినిమాల్లో బాలకృష్ణ లుక్, ఆయన విగ్గే మైనస్ గా నిలిచాయి. మహారథి, వీరభద్ర, రూలర్, జై సింహ ఇలా చాలా సినిమాల్లో బాలకృష్ణ విగ్, ఆయన లుక్ సినిమా మైనస్ పాయింట్స్ లో మెయిన్ గా నిలిచాయి. అదే బోయపాటి చేతిలో పడితే బాలయ్య లుక్ చాలా స్టైలిష్ గా మారిపోతుంది. కేరెక్టర్ ఎంత మాస్ గా ఉన్నా.. బాలయ్య స్టైలిష్ లుక్ హైలెట్ అవుతుంది.

ఒకప్పుడు లుక్స్ తో భయపెట్టిన బాలకృష్ణ ఈ మధ్యన అదే లుక్స్ తో తెగ హైలెట్ అవుతున్నారు. అఖండ మూవీలో ఓ కేరెక్టర్ స్టైలిష్ గాను, మరో కేరెక్టర్ అఘోర గా లుక్స్ వైజ్ గా భీబత్సం గా పాపులర్ అయ్యాయి. ఇక ఆహా కోసం అన్ స్టాపబుల్ షో లో బాలయ్య లుక్, అయన స్టైల్, అలాగే ఆయన హెయిర్ స్టయిల్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. బాలయ్య వేసిన కాస్ట్యూమ్స్ అన్ని అంటే అన్ని ఆకట్టుకున్నాయి. ఇక NBK 107 లో బాలయ్య లుక్ కూడా అదిరింది అనేలా ఉంది. ఆయన హెయిర్ స్టయిల్, లుంగీ, బ్లాక్ డ్రెస్ లో ఫస్ట్ టైం బాలయ్య నిజంగా అదరగొట్టేసారు. మరి ఒకప్పుడు లుక్స్ తో భయపెట్టిన బాలయ్య ఈసారి అదే స్టైలిష్ లుక్స్ తో ఇరగదీస్తున్నారంటూ నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Hot topic on Balayya stylish looks:

Balakrishna look from NBK 107 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ