Advertisementt

పవన్ ఫ్యాన్స్ స్పీడ్ సరిపోలేదు

Tue 22nd Feb 2022 11:36 AM
bheemla nayak trailer storm,bheemla nayak trailer views and likes record,bheemla nayak pre release event  పవన్ ఫ్యాన్స్ స్పీడ్ సరిపోలేదు
Power Star Fans Speed is Not Enough పవన్ ఫ్యాన్స్ స్పీడ్ సరిపోలేదు
Advertisement
Ads by CJ

అభిమానుల ఎదురుచూపుకు తెరదించుతూ ఎట్టకేలకు నిన్న రాత్రి విడుదలైన భీమ్లా నాయక్ ట్రైలర్ సోషల్ మీడియాపై సునామీలా విరుచుకుపడింది. 7 మిలియన్ వ్యూస్, 700 K లైక్స్ వరకూ రాకింగ్ స్పీడ్ తో రాకెట్ లా దూసుకువెళ్లి న్యూ హిస్టరీ క్రియేట్ చేసిన పవర్ స్టార్ ఫాన్స్ ఊపు ఆపై మందగించడంతో కొన్ని రికార్డ్స్ మిస్ అయ్యాయి. 

లైక్స్ వైజ్ టాలీవుడ్ టాప్ ట్రైలర్ గా భీమ్లా నాయక్ ని నిలబెట్టాలని ఎంతో ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ ఇప్పటికే 10 మిలియన్స్ వరకు వ్యూస్ ఇచ్చారు. 1 మిలియన్ పైగా లైక్స్ కొట్టారు. అయితే ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ అందుకోవడానికి పవన్ ఫ్యాన్స్ స్పీడ్ సరిపోలేదు. ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ కి 7 గంటల 43 నిముషాల్లోనే 1 మిలియన్ లైక్స్ వచ్చెయ్యగా... భీమ్లా నాయక్ ట్రైలర్ 13 గంటల 28 నిముషాలకు మిలియన్ లైక్స్ మార్కుని చేరుకుంది.

కాగా ఆరంభంలో అవధుల్లేని ఉత్సాహం చూపించిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆ తర్వాత స్లో అయిపోవడానికి కారణం ఆ ట్రైలరే అంటున్నారు. ట్రైలర్ లో ఫ్యాన్స్ ఆశించినంత మాస్ లేకపోవడం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డల్ గా ఉండడం అభిమానుల జోరుకి బ్రేకులేసిందట. అయితే సినిమాపై విపరీతంగా పెరిగిపోతోన్న అంచనాలను అదుపు చేసేందుకే ట్రైలర్ కట్ అలా ప్లాన్ చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా రేపు సాయంత్రం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మళ్ళీ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ వచ్చేస్తుంది. మరో రెండు రోజుల్లోనే భీమ్లా పొటెన్షియాలిటీ ఏంటో బాక్స్ ఆఫీస్ చెప్పేస్తుంది. 

 

Power Star Fans Speed is Not Enough:

Bheemla Nayak Trailer Reached 1 Million Likes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ