ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> BoycuttUVcreations hashtag trends in Twitter

ట్రెండింగ్ లో బాయ్ కాట్ యూవీ క్రియేషన్స్

BoycuttUVcreations hashtag trends in Twitter

ప్రభాస్ ఫాన్స్ గత రెండేళ్లుగా యూవీ క్రియేషన్స్ అంటేనే మండి పడుతున్నారు. ఆ నిర్మాణ సంస్థ పై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫాన్స్. ఎందుకంటే అనుకున్న టైం అనుకున్నట్టుగా యూవీ వారు అప్ డేట్స్ ఇవ్వకుండా ఫాన్స్ ని బాగా ఇబ్బంది పెడతారని, ప్రభాస్ సాహో విషయంలో ఇలానే చేసారు. ప్రమోషన్స్ లేకుండానే సినిమాని రిలీజ్ చేసి ప్లాప్ కొట్టారు. కనీసం రాధే శ్యామ్ విషయంలో అయినా యూవీ వారు అలెర్ట్ గా అప్ డేట్స్ అలాగే.. ప్రమోషన్స్ ని పక్కాగా ప్లాన్ చెయ్యడం లేదు అని వారి కంప్లైంట్. రాధే శ్యామ్ మొదలైనప్పటినుండి అప్ డేట్స్ విషయంలో ఎలాంటి తాత్సారం చేసారో.. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలోనూ యూవీ క్రియేషన్స్ ధోరణి బావుండలేదు అంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున #BoycuttUVcreations హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. 

ప్రభాస్ రాధేశ్యామ్ అప్ డేట్ ఇవ్వండి.. మార్చి 11 న సినిమా రిలీజ్. పాన్ ఇండియా లెవల్లో సినిమా రిలీజ్ కాబోతుంది. ఇంతవరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. కొంపదీసి.. డిసెంబర్ లో జరిగిన రాధే శ్యామ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తోనే సరిపెట్టేస్తారా ఏమిటి.. ఈ విషయంలో ప్రభాస్ క్రేజ్ ని ఉపయోగించుకుని ప్రమోషన్స్ చేయించుకోవాల్సిన యూవీ వారు.. ఇలా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండడం ఫాన్స్ కి అస్సలు నచ్చడం లేదు. అసలు యూవీ క్రియేషన్స్ ని ఇలా బాయ్ కట్ చేస్తూ చాలాసార్లు నేషనల్ వైడ్ గా ఫాన్స్ ట్రెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం #BoycuttUVcreations హాష్ టాగ్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ అప్ డేట్ ఇవ్వరా సామి అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 

Boy cutt UV creations hashtag trending

prabhas
radhe shyam
uv creations
boycuttuvcreations hashtag
prabhas fans
radhe shyam updates