Advertisementt

కృతి శెట్టి పై అలాంటి ఆరోపణలా

Mon 21st Feb 2022 04:11 PM
krithi shetty,uppena,shyam singha roy,bangarraju,nithin movie,ram the worrier movie,sudheer babu movie  కృతి శెట్టి పై అలాంటి ఆరోపణలా
Such is the allegation against Krithi Shetty కృతి శెట్టి పై అలాంటి ఆరోపణలా
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెట్టిన వెంటనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబమ్మ కృత్ శెట్టి ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి హిట్స్ తో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలకి మోస్ట్ లక్కీ హీరోయిన్ గా, క్రేజీ హీరోయిన్ గా మారిన కృతి శెట్టి ప్రస్తుతం నితిన్ తో మాచవరం నియోజకవర్గం సినిమా, రామ్ తో ద వారియర్ మూవీస్ తో పాటుగా సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాల్లో నటిస్తుంది. అయితే కృతి శెట్టి పై ఇప్పుడొక న్యూస్ ఆమె ఫాన్స్ కి షాకిస్తోంది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిన కృతి శెట్టి.. షూటింగ్ కి టైం కి రాదని, ఆమె వలన దర్శకనిర్మాతలు ఇబ్బంది పడుతున్నారనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అంతేకాకుండా తన కో ఆర్టిస్ట్ లతో కృతి శెట్టి ప్రవర్తన మర్యాదగా ఉండడం లేదని, కాస్త కేర్ లెస్ గా కృతి శెట్టి సినిమా సెట్స్ లో ప్రవర్తిస్తుంది అని ప్రచారం మొదలైంది. ఈ వార్తలు కృతి శెట్టి దగ్గరకి చేరడంతో ఆమె చాలా ఫీలైందట. అంతేకాకుండా ఈ వార్తలకి ఆదిలోనే చెక్ పెట్టాలని ఆమె అనుకున్నప్పటికీ.. ఆమె ఫ్రెండ్స్, సన్నిహితులు మాత్రం సక్సెస్ ఫుల్ గా సాగుతున్న హీరోయిన్స్ లైఫ్ లో ఇలాంటి రూమర్స్ వస్తుంటాయని, కెరీర్ ఆరంభంలో ఇలాంటివి సహజం, ఇలాంటివి ఖండించుకుంటూ పొతే.. అలవాటు గా మారుతుంది అని, ఇలాంటి పుకార్లను లైట్ తీసుకుని వదిలేయమని సన్నిహితులు నచ్చజెప్పడంతో కృతి శెట్టి కూల్ అయ్యింది అని తెలుస్తుంది. 

Such is the allegation against Krithi Shetty:

Krithi Shetty does't come on time for shooting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ