ఈ రోజు పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో తెరకెక్కిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరగాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేసారు. ఎందుకంటే ఏపీ ఐటి శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో.. భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే ఈ రోజు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది.. అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఈరోజు వాయిదా పడిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు ఫిబ్రవరి 22 సాయంత్రం యూసుఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగనున్నట్టుగా కొన్ని టివి ఛానల్స్ లో ప్రసారమవుతుంది. ఈ విషయమై భీమ్లా నాయక్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ నుండి స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రానికి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్యెల్యే గోపినాధ్ లు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. భీమ్లా నాయక్ ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.