పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మరో నాలుగు రోజుల్లో బాక్సాఫీసుని షేక్ చెయ్యడానికి రెడీ అవుతుంది. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ఇచ్చారో లేదో.. ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఈ రోజు భీమ్లా నాయక్ ట్రైలర్ ని రాత్రి 8.10 నిమిషాలకి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. దానితో పవన్ ఫాన్స్ అలెర్ట్ అయ్యారు. భీమ్లా నాయక్ ట్రైలర్ ని వరల్డ్ వైడ్ గా ట్రెండ్ చేసి.. వ్యూస్, లైక్స్ విషయంలో టాప్ లో ఉంచాలని చూస్తున్నారు. ఇక ఇదే రేజు కేటీఆర్ గెస్ట్ గా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేసారు మేకర్స్. కేటీఆర్ - పవన్ కళ్యాణ్ ఒకే స్టేజ్ మీదకి రావడంఅనేది అటు టిఆర్ ఎస్ శ్రేణుల్లో ఇటు పవన్ ఫాన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చెయ్యలా అనే ఆతృతలో ఫాన్స్ ఉన్నారు.
కానీ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరగడం లేదు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయ్యింది. ఎందుకంటే వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది.. అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడంతో యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నేడు జరగాల్సిన భీమ్లా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది.